గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:54 PM
గ్రామీణాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వర్లు అన్నారు. నూతనంగా ఎన్నికైన 19 జీపీల వార్డు సభ్యులకు 5 రోజుల శిక్షణ కార్యక్ర మాన్ని మంగళవారం నెన్నెల రైతువేధికలో ప్రారంభించారు.
-డీపీవో వెంకటేశ్వర్లు
నెన్నెల, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వర్లు అన్నారు. నూతనంగా ఎన్నికైన 19 జీపీల వార్డు సభ్యులకు 5 రోజుల శిక్షణ కార్యక్ర మాన్ని మంగళవారం నెన్నెల రైతువేధికలో ప్రారంభించారు. ఈ సందర్భం గా డీపీవో మాట్లాడుతూ వార్డుమెంబర్లకు పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక మైన బాధ్యతలు కట్టబెట్టిందన్నారు. వార్డుల్లో సమస్యలు గుర్తించి పరిష్క రించడంలో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలన్నారు. పంచాయతీరాజ్ చట్టం, గ్రామసభల నిర్వహణ, ఆ ర్థిక వ్యవహారాలు, అభివృద్ధి పథకాల అమలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై వార్డు సభ్యులకు మాస్టర్ ట్రైనర్ల ద్వారా అవగాహన కల్పిస్తు న్నామని చెప్పారు. వార్డు సభ్యులు శిక్షణ తరగతులను సద్వినియోగం చే సుకోవాలని కోరారు. మండల అభివృద్ధి అధికారి మహమ్మద్ అబ్దుల్ హై, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.