Share News

kumaram bheem asifabad- గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకం

ABN , Publish Date - Jan 24 , 2026 | 10:31 PM

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కాగజ్‌నగర్‌ మైనార్టీ సంక్షేమ పాఠశాలలో పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో శనివారం కాగజ్‌నగర్‌ డివిజన్‌ సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమన్నారు. పంచాయతీ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు.

kumaram bheem asifabad- గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకం
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత

కాగజ్‌నగర్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కాగజ్‌నగర్‌ మైనార్టీ సంక్షేమ పాఠశాలలో పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో శనివారం కాగజ్‌నగర్‌ డివిజన్‌ సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమన్నారు. పంచాయతీ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, ఇందిరమ్మ ఇళ్ల పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో రైతులు ఒకే రకమైన పంట మాత్రమే కాకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబించి ఆర్థిక అభివృద్ధి చెందేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీల విధులు, అధికారాలు, ప్రజా సంక్షేమంపై అందిస్తున్న ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి గౌడ్‌, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మినారాయణ, డివిజనల్‌ పంచాయతీ అధికారులు ఉమర్‌ హుస్సెన్‌, హరి ప్రసాద్‌, ఐదు మండలాల పరిషత్‌ అభివృద్ది అధికారులు, సర్పంచ్‌లు, శిక్షకులు పాల్గొన్నారు.

పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌..

మండలంలోని తెలంగాణ జ్యోతీబాఫూలే పాఠశాలను కలెక్టర్‌ కె హరిత అన్నారు. సందర్శించారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న విద్యార్ధులు ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్ధుల చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని చెప్పారు. అనంతరం పలు సమస్యలను విద్యార్ధులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. పండ్లు సరఫరా చేయడం లేదని, ఇతర సమస్యలు వివరించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

క్షేత్రస్థాయి పర్యటనకు ఏర్పాట్లు చేయాలి

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): మిలటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ అధికారుల క్షేత్రస్థాయి పర్యటనకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో శనివారం అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌లతో కలిసి జిల్లాలో జరుగుతున్న హైదరాబాద్‌ డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో మిలటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ అధికారుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మిలటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఈ నెల 24 నుంచి 31 వరకు జరుగుత్నుందున సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సర్వీసు అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలను సందర్శించి ఇల్లా భౌగోళిక చరిత్ర, పలు విషయాలపై వివరాలు తెలుసుకుంటారని అన్నారు. వారికి అవసరమైన సమాచా రాన్ని అధికారులు అందించాలని తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి సురేష్‌, శిశు సంక్షేమాధికారి, అటవీ శాఖాధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 10:31 PM