పాఠశాలల అభివృద్ధిలో హెచ్‌ఎంల పాత్ర కీలకం
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:32 PM
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుల నా యకత్వం అత్యంత కీలకమని జిల్లా వి ద్యాశాఖాధికారి రమేశ్‌కుమార్ అన్నా రు.
- జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్‌కుమార్
నాగర్‌కర్నూల్ టౌన్, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుల నా యకత్వం అత్యంత కీలకమని జిల్లా వి ద్యాశాఖాధికారి రమేశ్‌కుమార్ అన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహి స్తున్న ఇంటిగ్రేటెడ్ ఇన్‌ఇర్వీస్ టీచర్ ట్రై నింగ్ శిబిరాన్ని డీఈవో సందర్శించి శిక్షణతీరు ను పరిశీలించారు. నాయకత్వ లక్షణాలు, సుప రిపాలన, ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే వి ద్యాప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ప్రతీ ప్రధానోపాధ్యాయుడు పరిపాలనతో పాటు వి ద్యార్థులకు స్ఫూర్తిదాయక నాయకుడిగా, ఉపా ధ్యాయులకు మార్గదర్శిగా వ్యవహరించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంపుతో పాటు, పరిశుభ్రత, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, తల్లిదండ్రులతో సమన్వయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిం చారు. కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ అధికారి కిరణ్‌కుమార్, సెక్టోరియల్ అధికారి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. నెం.2
ఫ అచ్చంపేట, (ఆంధ్రజ్యోతి) :ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన విద్యా ప్ర మాణాల పెంపే లక్ష్యమని డీఈవో రమేష్‌కు మార్ అన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఇన్-సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమంలో భా గంగా అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ప్రాథమిక పాఠ శాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను మంగళవారం డీఈవో పరిశీలిం చారు. విద్యార్థులపట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల ని ఉపాధ్యాయులకు సూచించారు.