రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర వెలకట్టలేనిది
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:08 PM
తె లంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర వెల కట్టలేనిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ అన్నారు.
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ
పెద్దకొత్తపల్లి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : తె లంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర వెల కట్టలేనిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంద ర్భంగా మంగళవారం మండల కేంద్రంలో అం బేడ్కర్ చౌరస్తాలో తెలంగాణ ప్రజానాట్య మం డలి ఆధ్వర్యంలో పలకల భజన, ఆటలుపాటలు డప్పులతో ఘనంగా వేడుకలు జరిగాయి. కార్య క్రమానికి ముఖ్య అతిథిగా విచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.బాలనరసింహ పా ల్గొని మాట్లాడుతూ సుదీర్ఘకాలం జరిగిన తెలం గాణ పోరాటంలో ప్ర జానాట్య మండలి కళాకా రుల పాత్ర మరువ లేనిదని అన్నారు. తెలంగా ణ సాధనలో పాల్గొన్న ప్రతీ కళాకారునికి జా బ్‌కార్డు, పెన్షన్, వాటి తోపాటు సంక్షేమ పథకా లను కళాకారులకు మొదటి ప్రాధాన్యతగా ఇవ్వాలని, ఇళ్లు లేని కళాకారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు తన్నీరు నరసింహ, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి బండి లక్ష్మీపతి, ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు నర సింహ, పర్వతాలు, తుపాకుల వెంకటేశ్, రామకృష్ణ, యాదగిరి, సలేశ్వరం, ఉషన్నగౌడ్, రాముడు, కుర్మయ్య, వెంకటస్వామి, జ్యోతి, మనీషా, శిరీష, సువర్ణ మాధవి, పద్మ, సీపీఐ మండల నాయకులు సాయిలు, లక్ష్మణస్వామి, బాలస్వామి, శివకృష్ణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు.