అంగన్ వాడీ కేంద్రాల పాత్ర కీలకం
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:30 PM
చిన్నారులకు పౌష్టికాహారం, గర్భి ణులు, బాలింతలు ఆరోగ్య పరిరక్షణలో అంగన్ వాడీ కేంద్రాలు కీలక పాత్ర ను పోషిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అ న్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్
నస్పూర్, అక్టోంబరు 4 (ఆంధ్రజ్యోతి) : చిన్నారులకు పౌష్టికాహారం, గర్భి ణులు, బాలింతలు ఆరోగ్య పరిరక్షణలో అంగన్ వాడీ కేంద్రాలు కీలక పాత్ర ను పోషిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అ న్నారు. మోదీ జన్మదినం, ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసు కున్న సం దర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా సీసీసీలో ని 28వ డివిజనల్‌లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం అంగన్‌వాడీ, ఆశా వర్కర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రజా సేవకు ప్రతీకగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17వరకు నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అక్టోబరు 7 వరకు అంగన్ వాడీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్య అందించి భావి భారత పౌరులుగా తీర్చిది ద్దడంలో అంగన్ వాడీ కార్యకర్తల, ఆశా వర్కర్లు అంకిత భావంతో పని చే స్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్ పట్టి వెంకట కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్య క్షుడు కమాలాకర్ రావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పచ్చ స్వప్న, శ్రీరాంపూర్ జోన్ అధ్యక్షురాలు రేణుక, సేవా సంకల్ప్ అభియాన్ కోకన్వీనర్ శిరీష, శ్రీరాంపూర్ జోన్ అధ్యక్షుడు సత్రం రమేష్, ప్రధాన కార్యదర్శి పొన్న వేని సదయ్య, నాయకులు సామ్రాజ్ రమేష్, శ్రీకాంత్, రవి, తేజ, పాల్గొన్నారు.