Share News

kumaram bheem asifabad- అధ్వానంగా ఎల్లారం రోడ్డు

ABN , Publish Date - Mar 25 , 2026 | 10:29 PM

జిల్లా కేంద్రం నుంచి ఎల్లారం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రోడ్డు పూర్తిగా కంకర తేలి అధ్వాన్నంగా మారింది. రోడ్డు మరమ్మతు పనులు ఆలస్యం కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. సదరు కాంట్రాక్టర్‌ పనులను సకాలంలో పూర్తి చేయ కుండా వదిలేయడంతో గ్రామస్థులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

kumaram bheem asifabad- అధ్వానంగా ఎల్లారం రోడ్డు
కంకర తేలి ఉన్న ఎల్లారం రోడ్డు

- మరమ్మతులపై అధికారులకు పట్టింపు కరువు

ఆసిఫాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం నుంచి ఎల్లారం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రోడ్డు పూర్తిగా కంకర తేలి అధ్వాన్నంగా మారింది. రోడ్డు మరమ్మతు పనులు ఆలస్యం కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. సదరు కాంట్రాక్టర్‌ పనులను సకాలంలో పూర్తి చేయ కుండా వదిలేయడంతో గ్రామస్థులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించేందుకు సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదు. 2018లో రోడ్డు నిర్మాణం, మరమ్మతులకు గాను 40 లక్షల నిధులు మంజూరు కాగా సంబంధిత కాంట్రాక్టర్‌ కొంత దూరం కంకర పోసి పనులను పూర్తి చేయకుండా వదిలి వేశారు. ఎల్లారం, కంచర్‌గూడ గ్రామాల ప్రజలు ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. కంకర తేలి ఉన్న ఈ రోడ్డు పై వెళ్లాలంటే నిత్యం నరక యాతన పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులైతే ఎదో ఓకచోట పడి గాయాలపాలవుతున్నా రని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ రోడ్డు దెబ్బతినడంతో గ్రామానికి వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. ప్రతి రోజు జిల్లా కేంద్రానికి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఈ రోడ్డు వెంట అతి కష్టంగా రాకపోకలు చేయాల్సిన పరిప్థితులు ఉన్నాయని గ్రామస్తులు చెబుతు న్నారు. ఇక నైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరు తున్నారు. అధికారులు పట్టించుకోకుంటే కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడుతామని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం..

- చటారే కారు. ఎల్లారం గ్రామస్థుడు

రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి చిన్న అవసరానికి నిత్యం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డు కంకర తేలి గుంతల మయంగా మారడంతో వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. అధికారు లు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి.

ప్రమాదాలకు గురవుతున్నారు..

- చౌదరి గంగారాం, వార్డు సభ్యుడు ఎల్లారం

ఆసిఫాబాద్‌ నుంచి ఎల్లారం వరకు రోడ్డు కంకర తేలి గుంతల మయంగా మారడంతో తరుచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్క వాహనంపై నుంచి కింద పడిపో వడంతో కాలు విరిగింది. రోడ్డు దెబ్బతినడంతో పాఠశాలలు, కళాశాలలకు ఆటోల్లో వెళ్లే విద్యార్థులు సైతం అవస్థలు పడుతున్నారు.

Updated Date - Mar 25 , 2026 | 10:29 PM