ఓటు హక్కును కాపాడాలి
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:19 PM
ఓటు హక్కును పరిరక్షించి, దేశంలో ప్ర జాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో కాం గ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ఓట్ బచావో..దేశ్ బచా వో’ కార్యక్రమాన్ని చేపడుతోందని డీసీసీ అధ్యక్షు డు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ అన్నారు.
- ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
- డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
- జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ
ముఖ్య నాయకుల సమావేశం
నాగర్‌కర్నూల్ టౌన్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యో తి) : ఓటు హక్కును పరిరక్షించి, దేశంలో ప్ర జాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో కాం గ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ఓట్ బచావో..దేశ్ బచా వో’ కార్యక్రమాన్ని చేపడుతోందని డీసీసీ అధ్యక్షు డు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సౌ భాగ్య గార్డెన్‌లో డీసీసీ ముఖ్య నాయకుల సమా వేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో వంశీకృష్ణ మాట్లాడు తూ ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత కీలకమైన హక్కు అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, సాధా రణ కూలీ అయినా ప్రతీ ఒక్కరికి ఒకే ఓటు హక్కు ఉంటుందని, ఇదే భారత ప్రజాస్వామ్య గొప్పతనమన్నారు. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ రూ పొందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన ఓటు హక్కును కల్పించిందని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం, ప్రధాని నరేం ద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేతృ త్వంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవర ణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ద్వారా ఓటర్లను తొల గించే ప్రయత్నాలు జ రుగుతున్నాయని ఆ యన ఆరోపించారు. ప్ర జాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడి భాగస్వా మ్యం అవసరమని, రా జ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవడం ద్వారా దేశ ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టు కోవాలని వంశీకృష్ణ అన్నారు. సమావేశంలో కాం గ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి రవీంద్రనాథ్, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారా యణ రెడ్డి, కూచకుళ్ల రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు.
స్టేడియం కోసం స్థలం పరిశీలన
నాగర్‌కర్నూల్ టౌన్, (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో, ఆర్టీవో కార్యాలయం వెనుక స్టేడియం నిర్మాణం కోసం కేటాయించిన 10 ఎకరాల స్థలాన్ని ఎమ్మె ల్యేలు వంశీకృష్ణ, రాజేష్‌రెడ్డి ఆదివారం పరిశీలిం చారు. ఈ సందర్భంగా స్టేడియం నిర్మాణానికి కెటాయించిన స్థలాన్ని పరిశీలించి, అక్కడి పరిస్థి తులను తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి అవరసమైన మౌలిక సదు పాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇ స్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాల యాల సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.