Share News

kumaram bheem asifabad-ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం

ABN , Publish Date - Jan 25 , 2026 | 09:43 PM

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్‌ పట్టణంలో ఆదివారం అధికారులు, యువకులు, విద్యార్థులతో కలిసి 2కే రన్‌ ర్యాలీ నిర్వహించారు.

kumaram bheem asifabad-ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం
ప్రతిజ్ఞ చేయిస్తున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్‌ పట్టణంలో ఆదివారం అధికారులు, యువకులు, విద్యార్థులతో కలిసి 2కే రన్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతీ పౌరుడి బాధ్యత అని చెప్పారు. ఓటింగ్‌ శాతం పెరిగినప్పుడే బలమైన సాధ్యమవు తుందని తెలిపారు. అనంతరం అధికారులు, సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్‌డీఓ లోకేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి) ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని తహసీల్దార్‌ కవిత అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరంచుకొని ఆదివారం మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా తహసీల్దార్‌ కవిత మాట్లాడుతూ ఓటు హక్కు వజ్రాయుధమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్‌గా నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో పాటిల్‌ జోత్స్న, ఎస్సై మహెందర్‌, కేజీబీవీ పాఠశాల ఇంచార్జీ ఎస్‌ఓ రైసా ఖాతున్‌, సర్పంచ్‌ సతీష్‌, ఉపసర్పంచ్‌ దీపక్‌, బిజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలగతి సుచిత్‌ తదితరులు పాల్గొన్నారు.

లింగాపూర్‌, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరంచుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. సీనియర్‌ సిటిజన్లను సన్మానించారు. అనంతరం మండల కేంద్రంలో విద్యార్థులతో గ్రామ స్థులతో మానవహారం నిర్వహించి ఓటరు ప్రతిజ్ఞ చేశారు అనంతరం విద్యార్థులకు 2కే రన్‌ నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ప్రదీప్‌, కార్యాలయ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని తహసీల్దార్‌ రహీముద్దీన్‌ అన్నారు. సిర్పూర్‌(టి)లో మండలంలో ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవంను పురస్కరించుకొని విద్యార్థులతో, మండల అధికారులు, సిబ్బందితో కలిసి ర్యాలీ, మానవహారం, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వృద్ధ ఓటర్లను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు తహసీల్దార్‌ బక్కయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య వయవస్థలో ఓటు వజ్రాయుధం లాంటిదని తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు అన్నారు.. మండల కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవంను పురస్కరించుకొని మండల అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి శివాజీ చౌరస్తా వద్ద ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎంఈవో జయరాజు, డీటీ దౌలత్‌, సర్పంచ్‌ పోశక్క, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): ఓటు వజ్రాయుధం లాంటిదని ఎంఈవో సునీత అన్నారు. మండల కేంద్రంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సిద్ధార్థ, తిరుపతి, అధికారులు జావీద్‌, ప్రకాష్‌, దేవాజీ, మారుతి, నాయకులు శ్రీవర్ధన్‌, వెంకటేష్‌, ఉపాధ్యాయుడు పునీష్‌ తదితరులు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని తహసీల్దార్‌ మునావర్‌ షరీఫ్‌ అన్నారు. మండల కేంద్రంలో కేసీబీవీ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీటీ గణేష్‌, ఎంఈవో శ్రీనివాస్‌, ఎస్సై విక్రమ్‌, సర్పంచ జయలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోా ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా 2కే రన్‌ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కుమరం భీం చౌరస్తా వరకు అధికారులు, విద్యార్థులు, గ్రామస్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీనివాస్‌, ఎస్సై నారాయణ, ఉపాధ్యాయులు, తహసీల్దార్‌ కార్యాల య సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): పెంచికలపేట మండలం ఎల్కపల్లి గ్రామంలో ఓటరు దినోత్సవంను పురస్కరించుకుని ఆదివారం కేజీబీవీ పాఠశాల నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాంచందర్‌, తహసీల్దార్‌ తిరుపతి, డీటీ, రెవెన్యూ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 09:43 PM