సింగరేణిని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:04 AM
సింగరేణి సంస్థను కాపాడుకుంటూ, కార్మికుల సంక్షేమాన్ని చూ సే బాధ్యత తమ ప్రభుత్వంపైనే ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
- కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు బోనస్ ఇచ్చిన ఘనత మాదే
- బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలవి సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్ర
- మారుపేర్ల సమస్య పరిష్కారానికి కమిటీ వేస్తాం
- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
మంచిర్యాల, జూన్ 13 (ఆంధ్రజ్యోతి) : సింగరేణి సంస్థను కాపాడుకుంటూ, కార్మికుల సంక్షేమాన్ని చూ సే బాధ్యత తమ ప్రభుత్వంపైనే ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కేం ద్రంలో 335 మంది కార్మికుల వారసులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి హాజరై మాట్లాడుతూ, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు బోనస్ ఇచ్చిన ఘనత తమదేనన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, క్రమం తప్పకుండా నిర్వహిస్తామని అన్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి ప్రస్తుతానికి కోల్ బెల్ట్ ప్రాంతంలోని ఏ డు జిల్లాల నుంచి 335 మందిని ఎంపిక చేయగా, వా రికి నియామక పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇంకా అనేక మంది డిపెండెంట్ ఉద్యోగులు ఉన్నారని, వారి దరఖాస్తులను పరిశీలించిన తరువాత తొందరలోనే వారికి కూడా నియామకపత్రాలు ఇస్తా మన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సింగరేణిని దోపిడీ చేద్దామనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేద న్నారు. తొలిసారిగా సింగరేణి కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. సింగరేణిలో 40 వేల మంది పర్మనెంటు కార్మికులకు బోనస్ ఇస్తున్నట్లుగానే తొలి సారిగా కాంట్రాక్, అవుట్‌సోర్సింగ్ కార్మికులు 30 వేల మందికి రూ.5 వేల చొప్పున బోనస్ ప్రవేశపెట్టామ న్నారు. సంస్థ, కార్మికుల సంక్షేమం కోసం తాము ప్ర యత్నిస్తుంటే కాంగ్రెస్ సంగరేణిని దోపిడీ చేస్తోందనే అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. సింగరేణిని దోపి డీ చేసిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని విమర్శించారు. సింగరేణి బొగ్గు మాయమైందనే బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని కిలో బొగ్గు కూడా అక్రమంగా బయటికి వెళ్లే అవకా శం లేదన్నారు. సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్రలు జ రుగుతున్నాయని, కార్మికులు అప్రమత్తంగా ఉండాల ని కోరారు. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి సింగరేణికి ఏం చేశారో చెప్పాలన్నారు. సింగరేణికి రావాల్సిన రెండు బొగ్గు బ్లాకులను అడ్డుకున్నది మీరు కాదా అని ప్రశ్నిం చారు. ఆ రెండు బొగ్గు బ్లాకులు సింగరేణికి వచ్చి ఉం టే రూ.2624 కోట్ల లాభం వచ్చేదని, ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పగించడం వల్ల ఆ మొత్తం సం స్థ నష్టపోయిందన్నారు. మీ కుట్రలు పనిచేయకుం డా అడ్డుకుంటామని, బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలను అడ్డు కుంటామన్నారు. సింగరేణి బోర్డు స్వతంత్ర ప్రతిపత్లి కలిగి ఉందని, దానిని అత్యంత పటిష్టంగా, న్యాయబ ద్ధంగా బోర్డును కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సిం గరేణిలో ఇక మీదట ఎవరూ వేలుపెట్టలేని విధంగా పట్టిష్టం చేస్తామన్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వం సింగరేణి ని ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా, ఇంటి సంస్థ గా వాడు కుందని ఆరోపించారు. మెడికల్ ఇన్‌వ్యాలి డేషన్/ మారుపేర్ల అంశంపై రాజకీయం చేస్తున్నారని విమ ర్శించారు. మారుపేర్ల విషయంలో రెండు రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పిన కేసీఆర్ పదేళ్లు గడిచినా ఎం దుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, 15 ఏళ్లలో సింగరేణిలో జరిగిన అవి నీతిని వెలికితీస్తారా అని ప్రశ్నించారు. మరో మంత్రి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వంపై ఆర్థిక భా రమున్న, కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటుదని అన్నారు. మం చిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మాట్లాడు తూ, కారుణ్య నియామకపత్రాలు జిల్లాకేంద్రంలో అం దజేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేల కృషివల్లనే ఇది సాధ్యప డిందన్నారు. 335 మందిలో 115 మంది మంచిర్యాల నియోజకవర్గానికి చెందినవారు కావడం గర్వకారణమ న్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి కార్మికుల పక్షాన్నే ఉందని, వారి శ్రేయస్సు కోసం కట్టుబడి ఉందన్నారు. మరమ్మతుల దశకు చేరిన సింగరేణి క్వార్టర్లను రిటైర్డ్ కార్మికులకు అందజేయాలని కోరారు. కార్మికులకు ఆ దాయపు పన్ను రీయింబర్స్‌మెంట్ ఇస్తే మనల్ని ఆశీ ర్వదిస్తారని అన్నారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కా ర్మికులకు బోనస్ రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచాలని ఉప ముఖ్యమంత్రికి విన్నవించారు. బెల్లం పల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ, తన తండ్రి వెంకటస్వామి 1992లో టెక్స్‌టైల్స్ మంత్రి అయ్యాక సింగరేణిని కాపాడారన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కార్మి కులది పెద్ద పాత్ర అన్నారు. రిటైర్డ్ కార్మికులకు ఖ చ్ఛితంగా పింఛన్ పెంచి తీరాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని కోరారు. అనంతరం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, భూపాలపల్లి ఎ మ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరె క్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ భాస్కర్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షు డు వి. సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జన రల్ జనక్ ప్రసాద్‌తో పాటు శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి ఏరియాల జీఎంలు మునిగంటి శ్రీనివాస్, రమేష్, రాధాకృష్ణ, నగర మేయర్ ధరణి మధుకర్, కార్మిక కుటుంబాలు పాల్గొన్నాయి.