Share News

‘దోస్‌’్తకు స్పందన అంతంతే..!

ABN , Publish Date - May 10 , 2026 | 11:22 PM

రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి గత నెల 13న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి విడుత రిజిస్ర్టేషన్లు అదే నెల 15న ప్రారంభం కాగా ఈ నెల 7తో ముగిసింది.

‘దోస్‌’్తకు స్పందన అంతంతే..!

-ఈ నెల 7తో ముగిసిన మొదటి విడత

-15వ తేదీ నుంచి రెండో విడుత రిజిస్ట్రేషన్లు

-షెడ్యూల్‌ ప్రకటించిన ఉన్నత విద్యా మండలి

-మూడు దశలో డిగ్రీ సీట్లు కేటాయింపు

మంచిర్యాల, మే 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి గత నెల 13న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి విడుత రిజిస్ర్టేషన్లు అదే నెల 15న ప్రారంభం కాగా ఈ నెల 7తో ముగిసింది. అయితే వివిధ కారణాల చేత విద్యార్థుల నుంచి పెద్దగా స్పందన లేనట్లు కనిపిస్తోంది. ాదోస్త్‌్‌ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో బకెట్‌ సిస్టమ్‌, రిజర్వేషన్లతో ప్రవేశాలు చేపట్టనున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, పైవ్రేటు, ఎయిడెడ్‌ డిగ్రీ కాళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్ల కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మూడు విడతల్లో కొనసాగనుంది. అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తికాగానే జూన్‌ 30 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ాదోస్‌్త్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

జిల్లాలో 7500 సీట్లు అందుబాటులో....

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో మొత్తం 7500 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి పట్టణాల్లో ఒక్కొక్కటి చొప్పున నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, జిల్లా కేంధ్రంలో మహాత్మా జ్యోతిభా పూలే డిగ్రీ కళాశాల (బాలుర), తెలంగాణ మహిళ సాంఘీక సంక్షేమశాఖ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అలాగే ప్రైవేటు కళాశాలలు 12 వరకు ఉన్నాయి. అలాగే డిగ్రీ స్థాయిలో అన్ని గ్రూపుల్లో చేరేందుకు విద్యార్థులు ాదోస్త్‌్‌ ద్వారా దరఖాస్తులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం వెబ్‌ సైట్‌ ఛీౌట్ట.ఛిజజ.జౌఠి.జీుఽలో లాగిన్‌ కావడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవలసి ఉంటుంది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు మొదటి దశలో రూ. 200 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆధార్‌ లింక్‌ ఉన్న మొబైల్‌ నంబర్‌తో ఆన్‌లైన్‌లో తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ (యూజర్‌ ఐడీ) ద్వారా లాగిన్‌ కాగానే ఆరు అంకెలుగల పాస్‌ వర్డ్‌ వస్తుంది. ఇందులో డిగ్రీలో ఉన్న ఏదైనా సబ్జెక్ట్‌ కోసం ఆప్షన్స్‌ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణలోని ఎనిమిది యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ పొందేందుకు ఈ రిజిస్ట్రేషన్‌ ఉపయోగపడుతుంది.

మూడు దశల్లో అడ్మిషన్‌ ప్రక్రియ....

మొదటి దశలో భాగంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నెల 14న సీట్ల కేటాయింపు ఉంటుంది. అనంతరం 15వ తేదీ నుంచి జూన్‌ 25వ తేదీ వరకు రెండో దశ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉండగా, 30న సీట్ల అలాట్‌మెంట్‌ ఉంటుంది. అలాగే ఈ నెల 31 నుంచి జూన్‌ 15 వరకు మూడో దశ రిజిస్ట్రేషన్లకు గడువు ఇవ్వగా, 20న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్ల కేటాయింపులో విద్యార్థులకు అనుకూలమైన కళాశాల లేదా కోర్సు రానిపక్షంలో తిరిగి వెబ్‌ ఆప్షన్స్‌కు వెళ్లే వెసులుబాటు కూడా కల్పించారు. కాగా రెండు, మూడో దశలో సీట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే వారు రూ. 400 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ాదోస్త్‌్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ ఎం కుమారస్వామిని 9963104959 నంబర్‌లో సంప్రదిస్తే అడ్మిషన్‌ ప్రక్రియలో అవసరమైన సమాచారం లభిస్తుంది.

దోస్త్‌్‌కు ఇతర ఎంట్రన్స్‌ పరీక్షల దెబ్బ...

మొదటి విడుత ాదోస్త్‌్‌ రిజిస్ట్రేషన్‌లపై నీట్‌, ఎంసెట్‌, పాలిసెట్‌ ప్రవేశ పరీక్షల ప్రభావం పడనుంది. మొదటి దశ సీట్ల కేటాయింపు ఈ నెల 14న ఉండగా, ఈ విడుతలో పెద్దగా రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ పోటీ పరీక్షల కారణంగా రెండో, మూడో విడుతల వరకే విద్యార్థుల నుంచి స్పందన లభిస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ లేని కారణంగా ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు ఘననీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఆధారపడి పేద, మద్యతరగతి విద్యార్థులు ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరేవారు. రీయంబర్స్‌మెంట్‌కు ప్రభుత్వ సుముఖంగా లేకపోవడంతో సొంతంగా ఫీజులు చెల్లించి, ప్రైవేటు కాలేజీల్లో చదవలేని విద్యార్థులంతా రెండు, మూడు విడుతల్లో ాదోస్త్‌్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Updated Date - May 10 , 2026 | 11:23 PM