Share News

అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సంకల్పం

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:11 PM

నియోజకవర్గ ప్రజలంతా అయురారోగ్యాలతో సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండాలన్నదే తన సంకల్పం అని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు.

అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సంకల్పం
లబ్ధిదారునికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

లక్షెట్టిపేట, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ ప్రజలంతా అయురారోగ్యాలతో సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండాలన్నదే తన సంకల్పం అని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆ దివారం ఎస్‌పీఆర్‌ గార్డెన్‌లో దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల లబ్ధి దారులకు మంజూరు అయిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కార్యక్ర మంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన నియోజక వర్గం ప్రజలకు ఆరోగ్య సమస్యలపై ధరకాస్తు పెట్టుకున్న ప్రతీ ఒక్క రికీ సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరు చేస్తామన్నారు. ఎంతో మందికి ఆసు పత్రి ఖర్చులకు డబ్బులు లేవని చెప్పడంతో ఎల్‌వోసీలను కూడా ఇ చ్చామన్నారు. ప్రజలు ఎవ్వరూ ఆరోగ్య సమస్యలతో అవస్థలు పడు తూ డబ్బులు లేక ఆసుపత్రులకు వెల్లకుండా నిర్లక్ష్యం చేయకూ డద ని స్థానిక నాయకులకు తమ పరిస్థితిని వివరించి తనను సంప్రదిస్తే ప్రభుత్వంతో మాట్లాడి సహాయం చేస్తామన్నారు. దండేపల్లి, లక్షెట్టిపే ట రెండు మండలాల్లో సుమారు 312మంది వివిధ సమస్యలతో ఆసు పత్రిల్లో చూపించుకుని వైద్యం చేయించుకోవడంతో అయిన ఖర్చుల నిమిత్తం ప్రభుత్వంకు అర్జీ పెట్టుకోవడంతో వాళ్ల అందరికి మంజూరు అయిన రూ.90లక్షల విలువ గల చెక్కులను లబ్దిదారులకు, వారి కు టుంబీకులకు అందించారు. ఈకార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షు రాలు సురేఖ, మున్సిపల్‌ చైర్మన్‌ అంజలినర్సయ్య, మార్కెట్‌ కమటీ చైర్మన్‌ అక్కల వెంకటేశ్వర్లు, వైస్‌ చైర్మన్‌ రాజేష్‌, మున్సిపల్‌ వైస్‌ చై ర్మన్‌ రాజేశ్వరి, పార్టీ పట్టణ అద్యక్షుడు షాహెద్‌ఆలీ, మండల అధ్య క్షుడు నలిమెల రాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 11:11 PM