సరైన పత్రాలతో రిజిస్ర్టేషన్ ప్రక్రియ చేపట్టాలి
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:04 AM
వ్యవసాయ భూములకు సంబంధించి రిజి స్ర్టేషన్ సమయంలో పత్రాలను పరిశీలించి రిజిష్ర్టేషన్ చేయాలని కలెక్టర్ కుమార్ దీప క్ అన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
తాండూర్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ భూములకు సంబంధించి రిజి స్ర్టేషన్ సమయంలో పత్రాలను పరిశీలించి రిజిష్ర్టేషన్ చేయాలని కలెక్టర్ కుమార్ దీప క్ అన్నారు. గురువారం తాండూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో భూముల రీస ర్వే చేయడంపై ద్వారకాపూర్ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సమగ్ర భూసర్వే అవగాహన సదస్సుకు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మండల తహసీల్దార్ జ్యోత్స్నతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ నిజాం పాలన సమయంలో భూములు అన్ని వారి ఆధీనంలో ఉండేవని, భూములు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తర్వాత సీ లింగ్, ఇనాం, లావుని పట్టాలు, 38 ఈ, పట్టా భూములు వంటి అనేక రకాలుగా విభ జించి సర్వే నెంబర్, ఖాతా నెంబర్లు తయారు చేశారన్నారు. ఈ సమయంలో జరిగిన భూమార్పులకు సంబంధించి న్యాయస్ధానాల్లో కొన్ని కేసులు కొనసాగుతున్నాయని, క్షే త్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేటప్టిన భూభారతి కార్యక్రమంలో భూమి రకాల వారీగా క్రమబద్ధీ కరణ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో అందిన దరఖాస్తు ల ను అర్హులను రికార్డులను చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటా మన్నారు. పట్టాదారు మరణించినట్లయితే ఆ భూమి వారసుల పేరిట మార్చేందుకు సరైన పత్రాలను సమర్పించారు. అన్‌సర్వేయిడ్ భూముల జాబితా కింద నమోదైన భూములకు సంబంధించి భూభారతిలో దరఖాస్తులు చేసుకుంటే రికార్డులను సరిచూ సి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం చేపట్టిన భూ భారతి కార్యక్రమంలో భూ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. అనం తరం రేపల్లెవాడ గ్రామంలోని మహేశ్వరి కాటన్ మిల్లును సందర్శించి పత్తి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. నిబంధనల ప్రకారం నాణ్యమైన పత్తిని కొనుగో లు చేసి సకాలంలో రైతుల ఖాతాల్లో నగదు జమచేయాలన్నారు. అనంతరం తంగళ్ల పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్మిస్తున్న షెడ్యూల్డు తెగల సంక్షేమవసతి గృహం భవన నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతంగా పను లను చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట సర్వే అండ్ ల్యాండ్ రికార్స్డ్ ఏడీ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్, అధికారులు ఉన్నారు.