kumaram bheem asifabad- దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:15 PM
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, కౌంటర్ ఇన్‌చార్జీలతో వీడియో కాన్ఫరెన్ఫ్ ద్వారా సమీక్షించారు.
ఆసిఫాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, కౌంటర్ ఇన్‌చార్జీలతో వీడియో కాన్ఫరెన్ఫ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్ఛంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా కుటుంబ సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వివరాలను ఆన్‌లైన్‌లో ఎలాంటి తప్పులు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. భీమా చేసుకునే వ్యక్తి వివరాలు సంతకం, నామినీ వివరాలతో కూడిన దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. కేవలం రేషనుకార్డు నంబరు ఉంటే సరిపోతుందని ప్రతి కౌంటర్ వద్ద రిజిష్టర్‌లో వారి వివరాలను నమోదు చేయాలని చెప్పాఉరు. ఫోన్‌లో యాప్ ద్వారా నమోదు చేయవచ్చని, నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత కుటుంబ సభ్యుల ఫోన్‌కు సందేశం అందుతుందని తెలిపారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలో విస్తృత ప్రచారం చేపట్టలని సూచించారు. సమావేశంలో సీపీవో గురువయ్య, డీపీవో భిక్షపతిగౌడ్, డీఆర్‌డీవో దత్తారావు, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీవైఎస్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.