Share News

కురిసిన వాన..మురిసిన రైతన్న

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:18 PM

జిల్లాలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకల్లో నీరు చేరి ప్రవహిస్తున్నాయి.

కురిసిన వాన..మురిసిన రైతన్న

-జిల్లాలో 72 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

-వాగులు, వంకల్లో పెరిగిన ప్రవాహం..

-సింగరేణి ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

-ఎల్లంపల్లి ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి మట్టం

మంచిర్యాల, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకల్లో నీరు చేరి ప్రవహిస్తున్నాయి. ఈ ఏడు ఏకదాటిగా గంటల తరబడి వర్షం కుర వడం ఇదే తొలిసారి కావడంతో వాతావరణం ఒక్కసారి చల్లబడి, ఇన్ని రోజులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఉపశమనం లభిం చినట్లయింది. జిల్లా వ్యాప్తంగా ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షానికి అ క్కడక్కడ కల్వర్టులు తెగిపోయి ప్రజలు రాకపోకలకు కొంతమేర ఇబ్బం దులు పడుతున్నారు.

జిల్లాలో నమోదైన వర్షపాతం...

జిల్లాలో ఎడతెరపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలోని కాసిపేట మండలం కొండాపూ ర్‌లో గరిష్టంగా 72.0 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే మందమర్రి మండం అందుగులపేటలో 23.3, హాజీపూర్‌ మండలంలో 11.5, మండ లంలోని పాలచెట్టు ఏరియాలో 10.8, జిల్లా కేంరఽధంలోని పాత మంచి ర్యాలలో 9.5, జన్నారం మండలంలో 9.0, నస్పూర్‌, జైపూర్‌ మండలాల్లో 6.3, లక్షెట్టిపేట మండలం శాంతాపూర్‌లో 5.5, కన్నెపల్లి మండలంలో 5.0, కోటపల్లి మండలంలో 4.8, భీమిని మండలం, దండేపల్లి మండలం ల్గెనూరులో 3.8, తాండూరు మండలంలో 3.5, బెల్లంపల్లి, కోటపల్లి మం డలాల్లో 3.0, చెన్నూరు మండలంలో 2.8, భీమారం మండలంలో 2.0, వేమనపల్లి మండలం నీల్వాయిలో 1.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

ఓసీపీల్లో ఉత్పత్తికి ఆటంకం...

జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాల కారణంగా జిల్లాలోని శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లలోని ఓపెన్‌ కాస్టు గనులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీగా వర్షపు నీరు చేరడంతో గనుల్లో భారీ యంత్రాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బొగ్గు తవ్వకాలు, ఓబీ మట్టి తొలగింపు పనులు పూర్తిగా నిలిచి పోయాయి. క్వారీల్లో నీరు నిలిచిపోవడంతో పనులు జరగడం లేదు. భా రీ వాహనాలు బురదలో కూరుకుపోయే అవకాశం ఉండటంతో ఒ డ్డుపై నిలిపి ఉంచారు. మూడు ఏరియాల్లోని ఇందారం, రామకృష్ణాపూర్‌, మం దమర్రి, గోలేటి, కైరిగూడ ఓసీపీల్లో ఒక్కరోజులో దాదాపు 32 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, సుమారు లక్షా 80వేల క్యూబిక్‌ మీటర్ల ఓబీ వెలికితతకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గనుల్లో నీరు నిల్వవ ఉండటంతో డంపర్లు, ఎక్సకవేటర్లు వంటి బారీ యంత్రాల నిర్వహణ కష్టంగా మారింది. ఫలితంగా బొగ్గు రవాణా కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. వర్షాలు తగ్గిన తరువాత గనుల్లో నిల్వ నీటిని తొలగించి, పరిస్థితిని సమీక్షించిన అనంతరమే పూర్తిస్థా యిలో కార్యకలాపాలు పున:రుద్దరించే అవకాశం ఉంటుంది.

ఎల్లంపల్లి ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి మట్టం.....

ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా గుడిపేట సమీపంలోగల ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు గ రిష్ట నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 142.26మీటర్ల ఎత్తు వరకు నీటి మట్టం ఉంది. అలాగే ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను సాయంత్రం 7.816 టీఎంసీల నీరు చేరింది. ఎగువ నుంచి 3621 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతుండటంతో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు నుంచి 447 క్యూసెక్కులు బయటికి వెళ్తుండగా ప్రస్తుతం హైద్రాబాద్‌లోని మెట్రోపాలిటన్‌ వాటర్‌ స్కీం కోసం 326 క్యూసెక్కులు, ఎన్టీపీసీ అవసరాలకు మరో 121 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెలన్నర రోజులు గడుస్తున్నా ఇప్పటి దాకా ఆశిం చిన మేర వానలు కురవకపోవడంతో ప్రాజెక్టు నీరు పూర్తిగా అడుగం టిపోయింది. దీంతో సాగు అవసరాలకు నీటిని బంద్‌ చేయగా, కేవలం తాగునీటి కోసం మాత్రమే విడుదల చేశారు. ప్రస్తుతం వర్షాలు ఆశాజ నకంగా ఉండటంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Updated Date - Jul 21 , 2026 | 11:18 PM