Share News

kumaram bheem asifabad- రెచ్చిపోతున్న మద్యం మాఫియా

ABN , Publish Date - Feb 15 , 2026 | 11:21 PM

జిల్లాలోని ఆయా మండలాలు, మున్సిపాటిల్లో మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం మాఫియాలా గా తలపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలతో పాటు మండలాల్లో ఉన్న 32 మద్యం షాపులున్నాయి. పలు షాపుల్లో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఎక్సైజ్‌ అఽధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలున్నాయి.

kumaram bheem asifabad- రెచ్చిపోతున్న మద్యం మాఫియా
బెజ్జూరులో మద్యం షాపు సీజ్‌ చేస్తున్న అధికారులు (ఫైల్‌)

- బార్‌లను తలపిస్తున్న పర్మిట్‌ రూంలు

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆయా మండలాలు, మున్సిపాటిల్లో మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం మాఫియాలా గా తలపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలతో పాటు మండలాల్లో ఉన్న 32 మద్యం షాపులున్నాయి. పలు షాపుల్లో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఎక్సైజ్‌ అఽధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలున్నాయి. తరచూ తనిఖీలు నిర్వహించాల్సిన ఎస్‌టీఎఫ్‌ బృందాలు చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నాయనే విమర్శలున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో మద్యం వ్యాపారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతోంది.

- ప్రతీ దుకాణానికి..

జిల్లా వ్యాప్తంగా ప్రతీ మద్యం దుకాణానికి ఒక పర్మిట్‌ రూంకు అనుమతి ఉంది. కానీ పర్మిట్‌ రూంలలో ఉండాల్సిన నిబంధనలు మాత్రం పాటించడం లేదు. ఈ పర్మిట్‌ గదుల్లో టేబుళ్లు, బెంచీలు వేసి బార్లను తలపిస్తు మద్యం వ్యాపారులు దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో విచ్చలవిడిగా బెల్టు షాపులతో పాటు అనుమతి లేని దుకాణాలు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్సైజ్‌ అదికారులు నిద్ర పోతున్నట్లు నటిస్తున్నారనే మందుబాబులు విమర్శిస్తున్నారు. గత రెండు నెలల క్రితం బెజ్జూరు, చింతలమానెపల్లి మండలాల్లోని వైన్‌షాపులను అధికారులు సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్దంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారని షాపులను సీజ్‌ చేసినప్పటికీ ఇంకా ఆయా మండలాల పరిధిలోని ఎంఆర్‌పీ రేట్లకంటే అధికంగా విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు చేస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. కేవలం కాగజ్‌నగర్‌ డివిజన్‌లోనే 16 మద్యం దుకాణాలు ఉన్నాయి. రూరల్‌ ఏరియాల్లో కిరాణా షాపుల్లో, చిన్న చితకా దుకాణాల్లో వందలాది బెల్టుషాపులున్నాయి. ఈ బెల్టుషాపులను కూడా పెద్ద పెద్ద గదుల్లో నిర్వహిస్తూ ఫర్నీచర్‌ సౌకర్యంతో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఒక్కో గ్రామంలో 2 బెల్లు షాపులు పోటా పోటీగా నిర్వహిస్తున్నారు. లైసెన్సుడు షాపులను తలదన్నే విధంగా బెల్టుషాపుల్లో అర్ధరాత్రి వరకు కూడా విక్రయాలు జరుపుతున్నారని ఫిర్యాదు చేస్తున్న పట్టించుకునే నాధుడే కరుయ్యాడు. గత జనవరిలో రెండు షాపుల్లో తనిఖీలు నిర్వహించినప్పటికీ దందా మాత్రం ఆగడం లేదనే ఆరోపణలున్నాయి. బెల్టుషాపుల్లో మద్యంతో పాటు గుడుంబా, నాటుసారా అమ్మకాలు కొనసాగిస్తున్న దాడులు చేసే సమాచారం ఎప్పటికప్పుడు నిర్వహకులకు అందిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా బెల్టుషాపుల్లో విచ్చలవిడి విక్రయాలపై సమాచారం ఇస్తే ప్రభుత్వమే రెవెన్యూ కోసం ప్రోత్సహిస్తోందని తామేమి చేయలేమని సిబ్బంది పేర్కొనడం గమనార్హం. ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న మద్యం వ్యాపారుల ఆగడాలకు చెక్‌ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 15 , 2026 | 11:21 PM