Share News

కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరగా తరలించాలి

ABN , Publish Date - Nov 28 , 2026 | 10:55 PM

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలో కేటాయించిన ప్రకారం రైసుమిల్లులకు త్వరగా తరలించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ పేర్కొన్నారు. శనివారం మం డలంలోని టేకుమట్ల, శెట్‌పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధా న్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరగా తరలించాలి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జైపూర్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలో కేటాయించిన ప్రకారం రైసుమిల్లులకు త్వరగా తరలించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ పేర్కొన్నారు. శనివారం మం డలంలోని టేకుమట్ల, శెట్‌పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధా న్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం సేకరణ, ని ల్వలు, రవాణా, నిబంధనల అమలు, సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కొనుగోలు కేం ద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేప ట్టాలన్నారు. నిబంధనల ప్రకారం ధాన్యం సేకరించానలి, తేమ శాతం పరిశీలన, నాణ్యత నిర్ధారణ పరీక్షలను వేగంగా పూర్తి చే యాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎ క్కువ కాలం నిల్వ ఉండకుండా జిల్లాలో సామర్ధ్యం మేరకు కేటా యించిన ప్రకారం సంబంధిత రైసుమిల్లులకు తరలించేలా చర్య లు చేపట్టాలన్నారు. ధాన్యం నిల్వలు పేరుకుపోతే తర్వాత వచ్చే రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కొనుగోళ్లలో ఎ లాంటి జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు సమన్వ యంతో పనిచేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నీడ, తాగునీ టి సౌకర్యాలు కల్పించడంతో పాటు అవసరమైన గోనె సంచు లు, టార్పాలిన్‌లు, ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు అందుబాటులో ఉం చాలన్నారు. కొనుగోలు కేంద్రాల సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. కలెక్టర్‌ వెంట ఏపీఎం సంతోష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 10:55 PM