Share News

కొనుగోలు చేసిన ధాన్యం గోడౌన్‌కు తరలించాలి

ABN , Publish Date - May 13 , 2026 | 11:36 PM

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిదాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను వెంట వెం ట గోడౌన్‌కు తరలించాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) చంద్రయ్య ఆదేశించారు. బుధవారం మండలంలో లింగాపూర్‌లో రామలక్ష్మణ్‌ రైస్‌మిల్లు గోడౌన్‌ను మండలస్థాయి అధికారులతో కలిసి సందర్శంచారు.

    కొనుగోలు చేసిన ధాన్యం గోడౌన్‌కు తరలించాలి
దండేపల్లిలో కొనుగోలు కేంద్రంలో రైతుతో మాట్లాడుతున్న ఆడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

దండేపల్లి మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిదాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను వెంట వెం ట గోడౌన్‌కు తరలించాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) చంద్రయ్య ఆదేశించారు. బుధవారం మండలంలో లింగాపూర్‌లో రామలక్ష్మణ్‌ రైస్‌మిల్లు గోడౌన్‌ను మండలస్థాయి అధికారులతో కలిసి సందర్శంచారు. ఆయన మా ట్లాడుతూ రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని పండించిన నాణ్యమైన ధా న్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు తీసుకవచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొను గోలు చేసిన వెంటవెంటనే గోదాంలకు తరలించాలన్నారు. రైతు సంక్షే మం లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ఆకాల వ ర్షాల కారణంగా ధాన్యం దెబ్బతినకుండా గోదాముల్లో నిల్వ చేసి కేటాయిం చిన ప్రకారం రైస్‌ మిల్లులకు ఽతూకం వేసిన ధాన్యం బస్తాలను లారీల ద్వా రా తరలించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. మిల్లుల వద్ద అధికారు ల కు తగ్గిన సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం దండేపల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులు, హామాలీలతో ఆయన నేరుగా మాట్లాడారు. రైతులను ఇబ్బంది పెడ్డకుండా నిర్వాహకులు కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతిని వేగవంతంగా గోదాంలకు లారీ తరలించాలని సంబంధిత ఐకే పి, ఏఈవోలను సూచించారు. నెల్కివెంకటాపూర్‌ కార్యాలయం వద్ద ఏర్పా టు చేసిన మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతు లు పండించిన ధాన్యం దెబ్బతినకుండా గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు లింగాపూర్‌ రామలక్ష్మణ్‌ గోదాము ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ రోహిత్‌దేశ్‌పాండే, ఎంపీడీవో జేఆర్‌ ప్రసాద్‌, ఐకేపీ ఏపీఎం లక్ష్మి, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 13 , 2026 | 11:36 PM