దాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:03 PM
ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఓం రైసుమిల్లు, బెజ్జాల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, కిష్టాపూర్ గ్రామంలోని అన్నపూర్ణ రైసుమిల్లును, సుముఖ గోదాములను తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి పరిశీలించారు.
-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఓం రైసుమిల్లు, బెజ్జాల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, కిష్టాపూర్ గ్రామంలోని అన్నపూర్ణ రైసుమిల్లును, సుముఖ గోదాములను తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం దాదాపు 1.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. హమాలీల కొరతను అధిగమించేందుకు హమాలీలను తీసుకుని ధాన్యం ఎగుమతి, దిగుమతులను వేగవంతం చేశామన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలోని హమాలీలతో కలిసి రెండు గోదాములను ఇచ్చారని, అకాల వర్షాల నేపధ్యంలో రైతులకు నష్టం జరగకుండా ధాన్యం నిల్వ చేస్తున్నామన్నారు. దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల మొక్క జొన్న పంటను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలని సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఏపీఎం సంతోష్‌కుమార్ తదితరులు ఉన్నారు.