ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:15 PM
గత సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధి కా రంలోకి వచ్చిందని, గెలిచిన తర్వాత ఏ హామీని సంపూర్ణంగా నెరవే ర్చలేదని బీజేపీ జిల్లా అద్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపారు. శుక్రవా రం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్
మందమర్రి టౌన్, నవంబర్ 13(ఆంధ్రజ్యోతి) : గత సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధి కా రంలోకి వచ్చిందని, గెలిచిన తర్వాత ఏ హామీని సంపూర్ణంగా నెరవే ర్చలేదని బీజేపీ జిల్లా అద్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపారు. శుక్రవా రం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇటీవల పకడ్బందీగా ప్రజలు ఓట్లు వేయాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం సర్ విధా నం ప్రవేశపెడితే దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని మండి పడ్డారు. సర్ విధానం పట్ల ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోలేదని, కాంగ్రెస్ పార్టీ ఎందుకు గగ్గోలు పెడుతుందో అర్దం కావడం లేదన్నా రు. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, 40 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంత వరకు ఇ వ్వలేదన్నారు. మందమర్రి పట్టణంలో తోళ్ల పరిశ్రమ ప్రారంభానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపో యిందని, రాబోయేది డబుల్ ఇంజన్ సర్కార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పాల్గొన్నారు.