ప్రగతి ప్రణాళిక అందరి భాగస్వామ్యంతో అమలు చేయాలి
ABN , Publish Date - May 22 , 2026 | 10:56 PM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యచర ణ ను అందరి భాగస్వామ్యంతో అమలు చేస్తా మని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, మే 22 (ఆంధ్ర జ్యోతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యచర ణ ను అందరి భాగస్వామ్యంతో అమలు చేస్తా మని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవన సమావేశ మంది రంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యచరణలో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. రెండు పడక గ దుల ఇళ్లను లబ్దిదారులను లాటరీ పద్దతిన పారదర్శకంగా కేటాయించామన్నారు. ఇందిర మ్మ ఇళ్ల పథకంలో అర్హులైన లబ్దిదారులకే ఇళ్లను కేటాయించామన్నారు. ఫించన్‌దారుల జీవన ప్రామాణికరణ ప్రక్రియ కొనసాగుతుం దని, నూతన పింఛన్‌ల కోసం ప్రభుత్వం జా రీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీ సుకుంటామన్నారు. అర్హులకు ఉచిత విద్యుత్, ఇందిర మహిళ శక్తి ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నామన్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు అందిస్తామన్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వం కృషి చేస్తుందని, సన్నరకం వడ్లకు మద్దతు ధరతోపాటు రూ. 500 బోనస్ అందిస్తుందన్నారు. దండేపల్లి, సోమనపల్లి, బెల్లంపల్లి మండల కేంద్రంలో యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల మంజూరు చేసి ఒక్కో పాఠశాలను 200 కోట్లతో పనులు చేప ట్టామన్నారు. ప్రభుత్వ విద్యాభివృద్ధికి కృషి చే స్తుందన్నారు. రైతులు వాణిజ్య పంటలతో పా టు కూరగాయలు సాగు చేసేలా రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాల న్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిం చేందుకు కేంద్రంలో సూపర్ స్పెసాలిటీ ఆసు పత్రి నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగు తున్నాయన్నారు. అధికారులు ప్రజాసమస్య లపై తక్షణమే స్పందించి పరిష్కరించే విధం గా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జెడ్పీ సీఈవో గణపతి, ముఖ్య ప్రణాళిక అధికారి పాపయ్య, కార్పోరేషన్ డి ప్యూటి మేయర్ సల్ల రమ్య, మున్సిపల్ చైర్ పర్సన్‌లు పద్మ, స్వాతి, సంధ్యారాణి, అధికా రులు పాల్గొన్నారు.