భాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:44 AM
భాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగితన పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య అదేశించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన
సిరిసిల్ల అర్బన్, జూన్ 22 (ఆంఽధ్రజ్యోతి): భాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగితన పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య అదేశించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవేన్స్‌డేకు జిల్లా నలుమూల నుంచి వచ్చిన భాధితులతో మట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని 23 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వచ్చిన ఫిర్యాదుల అధారంగా అయా మండలాల పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌ఐలతో ఫోన్‌లో మాట్లాడి భాధితులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్క రించి వారికి సమాచారం అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిం చి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్‌డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమ ర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్‌డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని అదనపు ఎస్పీ తెలిపారు.