Share News

పోస్ట్‌మెట్రిక్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Jan 17 , 2026 | 10:35 PM

షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ హాస్టళ్లలో పనిచేస్తున్న పోస్టుమెట్రిక్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఎం. శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని విద్యాన గర్‌ మార్క్స్‌ భవన్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సద స్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

పోస్ట్‌మెట్రిక్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌

శ్రీరాంపూర్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ హాస్టళ్లలో పనిచేస్తున్న పోస్టుమెట్రిక్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఎం. శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని విద్యాన గర్‌ మార్క్స్‌ భవన్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సద స్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యా ప్తంగా హాస్టళ్లలో పనిచేస్తున్న డే వాచ్‌మెన్‌, నైట్‌ వాచ్‌మెన్‌, కుక్‌, అసిస్టెంట్‌ కుక్‌, తదితర కార్మికుల వేతనాలు ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లిం చాలని ఎన్నోమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ఆందోళనలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. కార్మికులకు హాజరుపట్టిక గాని, పీఎఫ్‌గాని, ఈఎస్‌ఐగాని అమలు చేయడం లేదని, హాస్టళ్ల లో వసతులు కల్పించడం లేదని, అధిక పనిభారం మోపుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, కార్మికులకు నడు మ ఉన్న ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయా సమస్యలపై జిల్లా కలెక్టర్లకు, ఎస్‌సీడీడీ జిల్లా అధికారులకు, కార్మిక శాఖ అధికారులకు వినతి పత్రాలు అందించాలని తీర్మాణాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు డి. బ్రహ్మానందం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్య క్షులు అరుణ, అనురాధ, నాయకులు నాగేశ్వర్‌రావు, సంపత్‌, ప్రసాద్‌, వినీత్‌, ఉమ, వెంకటరమణ, లక్ష్మీ, కవిత, పద్మ, అంజలి, అనురాధ, వెంకటమ్మ, సరోజ, తారాబాయి, మాధవి, రేణుక పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 10:35 PM