Share News

సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:27 PM

జిల్లాలో పని చేస్తున్న కేజీబీవీ, యూ ఆర్‌ఎస్‌ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరిం చాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.కృష్ణ డిమాండ్‌ చేశారు.

సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు

- టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.కృష్ణ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పని చేస్తున్న కేజీబీవీ, యూ ఆర్‌ఎస్‌ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరిం చాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.కృష్ణ డిమాండ్‌ చేశారు. సోమవారం టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వ ర్యంలో కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ సమగ్ర శిక్షా ఉ ద్యోగులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించా రు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన విన తిపత్రం కలెక్టరేట్‌ ఏఓ చంద్రశేఖర్‌కు అందజే శారు. టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌. కృష్ణ మాట్లాడుతూ అనాథ, పాక్షిక అనాథ బాలి కల కోసం నిర్వహిస్తున్న కేజీబీవీలు, బాలుర కోసం నిర్వహిస్తున్న యూఆర్‌ఎస్‌లలో పని చే స్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ధీర్ఘ కాలం గా అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. రెండు దశాబ్దాలుగా పని చేస్తున్న వారు చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నారని అన్నారు. ఈ అ సెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం సహేతుక మైన నిర్ణ యం తీసుకుని సమస్య శిక్షా ఉద్యోగుల సమస్య లు పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్ర మంలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌శర్మ, నాయకులు సి.తిరుపత య్య, ఆర్‌. లక్ష్మణ్‌, రాజబాబు, కురుమయ్య, వెంకటయ్య, శేషగిరి, కోటేశ్వర్‌, వహీద్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 11:27 PM