Share News

బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:13 AM

బాధితుల సమస్యలను చట్టప రంగా పరిశీలించి త్వరితగితన పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బీగీతే ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవేన్స్‌డేకు

బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
బాధితుల సమస్యలు వింటున్న ఎస్పీ

సిరిసిల్ల అర్బన్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): బాధితుల సమస్యలను చట్టప రంగా పరిశీలించి త్వరితగితన పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బీగీతే ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవేన్స్‌డేకు జిల్లా నలుమూల నుంచి వచ్చిన భాధి తులతో మట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని 19 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వచ్చిన ఫిర్యాదుల అధారంగా అయా మండలాల పోలీస్‌ స్టేషన్‌ల ఎస్‌ఐలతో ఫోన్‌లో మాట్లాడి భాధితులు ఇచ్చిన ఫిర్యాదులను క్షుణంగా పరిశీలించి పరిష్కరించి వారికి సమాచారం అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్‌బీగీతే మాట్లాడుతూ ప్రజలకు పోలీస్‌ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్‌ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్‌ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్‌ లైన్‌ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్‌ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని జిల్లా ఎస్పీతెలిపారు.

Updated Date - Nov 03 , 2026 | 12:13 AM