Share News

అంగన్‌వాడీల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 02 , 2026 | 10:57 PM

ఎన్నికల సమయంలో కాం గ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అంగన్‌వాడీ, టీచర్లు, హెల్పర్లకు రూ. 18వేల వేతనం చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

అంగన్‌వాడీల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు

కలెక్టరేట్‌ ఎదుట ఏఐటీయుసీ ధర్నా

నస్పూర్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సమయంలో కాం గ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అంగన్‌వాడీ, టీచర్లు, హెల్పర్లకు రూ. 18వేల వేతనం చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌ ఎదుట తెలంగా ణ అంగన్‌వాడి టీచర్స్‌, హెల్పర్స్‌ అసోషియేషన్‌ (ఏఐటీయుసీ) ఆధ్వ ర్యంలో ఽనాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెర్కొన్న విధంగా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్స్‌కు ప్రతి నెల రూ. 18 వేల వేతనం కనీస వేతనం చెల్ల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. మూడేళ్లు గడిచినప్పటికి హామీ అమలుకు నోచుకోకుండా అలాగే మిగిలిపోయిందన్నారు. ఈ ధ ర్నా ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి మేకల దాసు, అంగన్‌వాడి యూనియ న్‌ అధ్యక్ష కార్యదర్శులు భూపతి రమాదేవి, తోకల సరస్వతీ, ఏఐటీ యు సీ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌ అలీ, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ ఖలిందర్‌ అలీఖాన్‌, కార్యదర్శి అప్రోజ్‌ ఖాన్‌, యూనియన్‌ నాయకులు సురేఖ, అరుణ, తిరుమల, కుసుమ కుమారి, శైలజా పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 10:57 PM