Share News

గత ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డూ ఇవ్వలేదు

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:35 PM

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క కొత్త రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కు డు వంశీకృష్ణ విమర్శించారు.

గత ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డూ ఇవ్వలేదు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

పదర, ఆగస్టు 22 (ఆంధజ్ర్యోతి) : పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క కొత్త రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కు డు వంశీకృష్ణ విమర్శించారు. పదర మండలంలో గత ప్రభుత్వహయాం లో ఒక్కరికైనా డబుల్‌ బెడ్రూం ఇల్లు వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేం దుకు కృషి చేస్తోందన్నారు. పదర మండల కేం ద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎ మ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రేషన్‌కార్డు లు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మాణిక్యం, తహ సీల్దార్‌ సురేష్‌బాబు, ఎంపీడీవో సుధాకర్‌, ఆర్‌ఐ వసీం, జిల్లా కార్యదర్శి రామలింగయ్య యాదవ్‌, ఆనంద్‌, తాజా మాజీ జడ్పీటీసీ రాం బాబునాయక్‌, మాజీ సర్పంచ్‌ రాయ శ్రీనివాసు లు, మద్దిమడగు డైరెక్టర్‌ ఆలరాజు, వెంకటయ్య, సుభదాసు, చిన్న చంద్రయ్యయాదవ్‌, అన్ని గ్రామాల రేషన్‌ డీలర్ల, అన్ని గ్రామాల సర్పం చ్‌లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:35 PM