పేదలకు ఇళ్ల స్థలాలు చూపించాలి
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:28 PM
27 సంవత్సరాల క్రితం ఇళ్లులేని నిరుపేదలకు అప్పటి ప్రభుత్వం గ్రామ సమీపంలోని ఓ సర్వే నెంబర్‌లో స్థలాలు కేటాయించి పట్టా సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందించిందని, ప్రస్తుతం ఎవరెవరికి ఎక్కడెక్కడో స్థలం చూపించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ స భ్యురాలు గీత కోరారు.
- సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు గీత
తాడూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : 27 సంవత్సరాల క్రితం ఇళ్లులేని నిరుపేదలకు అప్పటి ప్రభుత్వం గ్రామ సమీపంలోని ఓ సర్వే నెంబర్‌లో స్థలాలు కేటాయించి పట్టా సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందించిందని, ప్రస్తుతం ఎవరెవరికి ఎక్కడెక్కడో స్థలం చూపించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ స భ్యురాలు గీత కోరారు. సోమవారం భలాన్‌పల్లి గ్రామంలో నిరసన తెలిపిన అనంతరం నాగర్ కర్నూల్ ఆర్డీవో అర్చనకు లబ్ధిదారులతో కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లా డుతూ సర్వే నెంబరు 419/2లో 1999లో 52 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ పట్టాలు పొంది న లబ్ధిదారులకు వెంటనే ఇళ్ల స్థలాలు చూపిం చాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మం డల కార్యదర్శి అంతటి కాశన్న, ఇళ్ల స్థలాల పో రాట కమిటీ ప్రధాన కార్యదర్శి బారు గోపాల్, అధ్యక్షుడు ప్రభాకర్, పరశురాములు, పి.పర శురామ్, దాంగట్ల బాలస్వామి, వెలిజాల ఆగ్నే ష్, వెంకటేశ్వరమ్మ, చారి, నాదిరి రాములమ్మ, కుర్వ లక్ష్మమ్మ పాల్గొన్నారు.