పోలీసులు ప్రజలతో మమేకం కావాలి
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:46 PM
పోలీసులు ప్ర జలతో మమేకం కావాలని, సాంకేతిక సేవలను ప్రజ లకు చేరవేసేలా కృషి చేయాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భా గంగా గురువారం మండలంలోని మాదారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.
-సాంకేతిక సేవలను ప్రజలకు చేరవేయాలి
-రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
తాండూర్, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు ప్ర జలతో మమేకం కావాలని, సాంకేతిక సేవలను ప్రజ లకు చేరవేసేలా కృషి చేయాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భా గంగా గురువారం మండలంలోని మాదారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న సీపీకి డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, ఎస్‌ఐ సౌజన్య పుష్పగుచ్చా లు అందించి స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వా హనాలను, స్టేషన్ ఆవరణలోని క్రీడా ప్రాంగణాన్ని, పోలీసు వాహనాల నిర్వహనను పరిశీలించారు. ప్రతి పోలీసు వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, తాళ్లు, ట్రాఫిక్ కోన్స్, క్రైమ్ ప్రొటక్షన్ రిబ్బన్, రైట్‌గేర్ కిట్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అనంత రం పోలీస్‌స్టేషన్‌లోని కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరు ను పరిశీలించారు. స్టేషన్‌లోని రికార్డులు, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను సీఐ, ఎస్‌ఐలను అడిగి తెలుసుకు న్నారు. సిబ్బందితో మాట్లాడి విధుల్లో ఎదురవుతున్న సమస్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విస్తారమైన గ్రామీణ, గిరిజన ప్రాంతా లకు సేవలందిస్తున్న మాదారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రజలతో మరింత స్నేహ పూర్వకంగా ఉండాలని, వా రికి అందుబాటులో ఉండే పోలీసింగ్ అందించాలని సూచించారు. యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వ హించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మహిళల భద్రత, చిన్నారుల రక్షణకు చేపడుతున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను అత్యంత ప్రాధాన్యంతో అమలు చేయా లని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల వినియోగం వల్ల కలిగే నష్టాలనువిద్యార్థులు, యువ తకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. సీ సీ కెమెరాల ఏర్పాటు వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ముందస్తు కార్యచరణ ప్రణాళిక సిద్ధంగా ఉంచాల న్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఆయన వెంట పోలీసులు ఉన్నారు.