Share News

పోలీసులు జవాబుదారీ తనంతో పని చేయాలి

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:26 PM

పోలీసులు ప్రజలకు జవా బుదారి తనంతో పని చేయాలని, పోలీసుల పట్ల భరోసా కలిగించే లా బాధితులకు అండగా నిలువాలని రామగుండం పోలీసు కమిష నర్‌ అంబర్‌ కిషోర్‌ ఠుూ అన్నారు. ఆదివారంరాత్రి దండేపల్లి పోలీ సుస్టేషన్‌ను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మంచిర్యాల డీసీపీ భాస్కర్‌తో కలిసి సీపీ ఆకస్మీకంగా తనిఖీ చేపట్టారు.

పోలీసులు జవాబుదారీ తనంతో పని చేయాలి
దండేపల్లి పోలీసుస్టేషన్‌లో సిబ్బందికి సూచనలు ఇస్తున్న రామగుండం సిపి అంబర్‌ కిషోర్‌ షూ

రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఠుూ

దండేపల్లి మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పోలీసులు ప్రజలకు జవా బుదారి తనంతో పని చేయాలని, పోలీసుల పట్ల భరోసా కలిగించే లా బాధితులకు అండగా నిలువాలని రామగుండం పోలీసు కమిష నర్‌ అంబర్‌ కిషోర్‌ ఠుూ అన్నారు. ఆదివారంరాత్రి దండేపల్లి పోలీ సుస్టేషన్‌ను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మంచిర్యాల డీసీపీ భాస్కర్‌తో కలిసి సీపీ ఆకస్మీకంగా తనిఖీ చేపట్టారు. రికార్డులు, రిసెప్షన్‌, కంప్యూ టర్‌లో కేసుల ఆన్‌లైన్‌ నమోదు తీరును నేరుగా పరిశీలించారు. సీ పీ మాట్లాడుతూ పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్ష ణమే స్పందించాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని, అ సాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహ రించాలన్నారు. పోలీసు పట్ల ప్రజలకు సమ్మకం కలిగించే విధంగా పోలీసులు నిజాయితీగా పని చేయాలన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా వాహనాలు తనిఖీలు నిర్వహించాలన్నారు. అనంతరం పోలీసుస్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలపై ఆరా తీయడంతో పాటు నేరాల నియంత్రణకు తీ సుకుంటున్న చర్యలను ఎస్సై తహసీనోద్దీన్‌ను అడిగి తెలుసుకున్నా రు. ప్రతి రోజు మండల పరిదిలోని అన్ని గ్రామాలలో పోలీసు సిబ్బందితో పెట్రోలింగ్‌ చేపట్టి ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సీపి వెంట సీఐ రమణమూర్తి, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 11:26 PM