kumaram bheem asifabad- పోడు భూముల రగడ
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:24 PM
మండలంలోని మామిడిపెల్లి వంజారీగూడా గ్రామానికి చెందిన పోడు భూములు సాగు చేస్తున్న రైతులు శనివారం ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్నారు. శనివారం ఉదయం అటవీ శాఖ అధికారులు పోడు భూము లకు సర్వే చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులందరు పెద్ద ఎతున సంఘటన స్థలంలోకి చేరుకుని వారిని అడ్డుకున్నారు
న్యాయం చేయాలని వినతి
లింగాపూర్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మామిడిపెల్లి వంజారీగూడా గ్రామానికి చెందిన పోడు భూములు సాగు చేస్తున్న రైతులు శనివారం ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్నారు. శనివారం ఉదయం అటవీ శాఖ అధికారులు పోడు భూము లకు సర్వే చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులందరు పెద్ద ఎతున సంఘటన స్థలంలోకి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ధర్నా చేశారు. ఈ భూమి ఫారెస్ట్ ఆధీనంలో ఉందని సదరు అధికారులు చెప్పారు. దీంతో రైతులు ఆగ్రహించారు. ఈ భూములను తాము దశాబ్దాల నుంచి సాగు చేస్తూ బతుకుతున్నామని ఫారెస్ట్ అధికారులు సర్వేల పేరట తమకు మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని వారు వాపోయారు. పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు అన్యాయం చేస్తే ఉరుకునేది లేదని ఎంతటి త్యాగానికైన సిద్ధమేనని చెప్పారు. తమకు పట్టాలిచ్చి ఆదుకోవల్సిన అధికా రులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఇలాంటి ఆలోచనల్ని ప్రభుత్వం విరమించుకోవాలని, పేద రైతులకు అండగా నిలువాలని డిమాండ్ చేశారు.
మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే..
లింగాపూర్ మండలంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుక్ను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మామిడిపెల్లిలో సంఘటన స్థలాన్ని సందర్శించి రైతులకు మద్దతుగా నిలిచారు. రైతుల పక్షాన మాట్లాడారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులను నిలదీశారు. విత్తనాలు వేసుకుంటున్న సమయంలో పారెస్ట్ అధికారులు పోడు రైతులకు ఆటంకం కల్గించకూడదని, పేద రైతులకు అన్యాయం చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో జాయింట్ సర్వే నిర్వహించి, పోడు రైతులకు శాశ్వతపరిష్కారం చూపాలని ఆధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కన్జర్వేటర్ అఫ్ ఫారెస్ట్ అధికారి శాంతారాం, డీఎఫ్‌వో బాలామణి, ఎఫ్‌ఆర్వో రమేశ్, ఎస్సై సురేష్, సీఐ రమేశ్ లింగాపూర్ మండల ప్రజలు పాల్గొన్నారు.