kumaram bheem asifabad-అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు
ABN , Publish Date - Jul 17 , 2026 | 10:49 PM
పొరుగు సేవల ఏజెన్సీలు కార్మికులు, సిబ్బంది పీఎ ఫ్, ఈఎస్‌ఐ డబ్బుల్లో కోట్లాది రూపాయల స్వాహా చేస్తూ తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నప్ప టికీ అమాయ కులైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టిం చుకునే వారే కనబడడం లేదు. ఏజెన్సీల పనితీరును అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు, ఉద్యోగుల డబ్బులు సొంతానికి వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
- జిల్లా వ్యాప్తంగా పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులు స్వాహా
- ఆందోళన చేపట్టినా పరిష్కారం కాని సమస్య
కాగజ్‌నగర్ టౌన్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): పొరుగు సేవల ఏజెన్సీలు కార్మికులు, సిబ్బంది పీఎ ఫ్, ఈఎస్‌ఐ డబ్బుల్లో కోట్లాది రూపాయల స్వాహా చేస్తూ తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నప్ప టికీ అమాయ కులైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టిం చుకునే వారే కనబడడం లేదు. ఏజెన్సీల పనితీరును అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు, ఉద్యోగుల డబ్బులు సొంతానికి వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20కి పైగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలున్నాయి. జిల్లాలో సుమారు 500 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యో గులు, కార్మికుల నెల నెల కట్ అయ్యే పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులను మాయమ వుతున్నాయి. అసలే వేతనాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. అయినా కొన్ని నెలల డబ్బులు మాత్రమే జమ చేస్తూ కొన్ని నెలల పీఎఫ్ డబ్బులు కాస్తా స్వాహా చేస్తున్నారు కొంత మంది ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు. కోట్లాది రూపాయల పీఎఫ్, ఈఎస్‌ఐ స్కాం జరుగుతుండడంతో కార్మికు లు, ఉద్యోగులకు భద్రత కరువవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో పారిశుధ్య, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, జిల్లా జనరల్ ఆసుపత్రి, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలలో సిబ్బంది ఔట్ సోర్సింగ్ కింద పని చేస్తున్నారు. దీంతో గత సంవ త్సరం క్రితం ఆందోళన సైతం చేపట్టారు. ఆయా ఏజెన్సీల నిర్వహకులు ఈఎస్‌ఐ, పీఎఫ్ డబ్బులు స్వాహా చేసి కాంట్రాక్టులు సైతం విడిచి పెడుతున్నా రనే ఆరోపణలున్నాయి. అవగాహన లేకపోవడంతో కార్మికుల డబ్బులు స్వాహా చేస్తున్నారనే అంటున్నా రు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఉన్నతా ధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నారు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, తిర్యా ణి, బెజ్జూరు, మెడికల్ కాలేజీ సిబ్బంది ఈఎస్‌ఐ, పీఎఫ్ డబ్బులు గత కొన్నేళ్లుగా జమ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. అసలు వివరాలు కూడా ఏమీ ఉద్యోగులకు, కార్మికులకు గానీ ఇవ్వడం లేదని అంటున్నారు. ప్రతీ నెల నెల వేతనాలు కూడా సక్ర మంగా రావడం లేదని వచ్చే జీతాలకు కూడా ఎలాంటి స్లిప్పులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు ఏజెన్పీ నిర్వాహకులకు సహకారం అందిస్తూ చూసీచూడనట్లు వదిలేస్తున్నా రని పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా 500 మంది పేషెంట్ కేర్, జిల్లా జనరల్ ఆసుపత్రి, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ, ఆసిఫాబాద్ నర్సింగ్ కాలేజీల్ల్లో ఔట్ సోర్సింగ్ ప్రాదిపదికన శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్‌లుగా పని చేస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఏరియా ఆసుపత్రి, జైనూరు, తిర్యాణి, సిర్పూర్ (టి), బెజ్జూరు, వాంకిడి ఆసుపత్రుల్లో పలు ఏజెన్సీల కింద వందల మంది పని చేస్తున్నా రు. వీరిలో కొంత మంది కాంట్రాక్టర్లు పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులు జమ చేయడం లేదు. ఫిర్యాదులు చేయడంతో పలువురు కార్మికులకు కొంత మేర జమ చేసినా ఇంకా బకాయిలున్నాయి. కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి, ఆసిఫాబాద్, మెడికల్ కాలేజి, తిర్యాణి, బెజ్జూరులో ఏజెన్సీ కింద, పని చేసే కార్మి కులకు కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నట్లు కార్మిక సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది కాగజ్‌నగర్ ఏరియా ఆసుపత్రి ఎదుట ఆందోళన చేసి ఎటువంటి ఫలితం లేదని, కార్మికుల వేతనాల్లో నుంచి కోత విధించి డబ్బులు జమ చేయని వివిధ సదరు ఏజెన్సీ నిర్వాహకులపై విచారణ చేపట్టి బ్లాక్ లిస్టులో పెట్టాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టాలి..
- బోగె ఉపేందర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఔట్ సోర్సింగ్ కార్మికుల ఈఎస్‌ఐ, పీఎఫ్ డబ్బు లు స్వాహా చేసిన వారి ఏజెన్సీలను తొలగించి ఆయా ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టాలి. స్వాహా చేసి ఏజెన్సీ వదిలేసి తప్పించుకుంటున్న కాంట్రా క్టర్లపై కేసు నమోదు చేసి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలి. కోట్లాది రూపాయలు దోపిడీ చేసిన కాం ట్రాక్టర్లపై విచారణ జరిపించాలి. ఈ విషయంలో కలెక్టర్‌కు ఉన్నతాధికారులకు విన్నవించాం. బాధ్యు లైన అధికారులపై సైతం చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. సమస్య పరిష్కారం కాకుంటే త్వరలోనే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతాం.