గోనె సంచుల్లేక మొక్కజొన్న రైతుల అవస్థ
ABN , Publish Date - May 03 , 2026 | 11:30 PM
గోనె సంచుల్లేక మొక్కజొన్న రైతులు అవస్థలు పడుతున్నారని, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దే శ్యానాయక్ అన్నారు.
- సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దేశ్యానాయక్
అచ్చంపేటటౌన్, మే3 (ఆంధ్రజ్యో తి) : గోనె సంచుల్లేక మొక్కజొన్న రైతులు అవస్థలు పడుతున్నారని, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దే శ్యానాయక్ అన్నారు. ఆదివారం ప ట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతుల సమ స్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం తె చ్చి మూడు రోజులైనా ఎవరూ పట్టించుకోవ డంలేదని, సరిపడా బ్యాగులు ఇవ్వక స్వయంగా మేమే కొనితెచ్చుకున్నామని సీసీబెడ్డు లేక ధాన్యం మట్టిలో కలిసిపోతుందని ఆరోపించారు. కనీసం తాగడానికి మంచినీళ్లు దొరకడం లేద న్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నా యకులు వెంకటయ్య, పర్వతాలు, వాల్యనాయ క్, పాల్గొన్నారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి : సీపీఎం
ఉప్పునుంతల, మే 3 (ఆంధ్రజ్యోతి) : మం డలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రా రంభించి మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి చింతల నాగరాజు అన్నారు. ఆదివారం మండల కేంద్రం లోని దేవదారికుంటతండా సమీపంలోని గోదాం లో అచ్చంపేట సింగిల్‌విండో ద్వారా చేపట్టి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీ లించారు. మండంలో 10వేల ఎకరాల విస్తీర్ణం లో మొక్కజొన్న సాగు చేసిన విషయం తెలిసి నా అధికారులు అచ్చంపేట, ఉప్పునుంతల మండలాలకు కలిసి ఒకే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు రైతులు ఉన్నారు.