Share News

kumaram bheem asifabad- నాటిన మొక్కలను సంరక్షించాలి

ABN , Publish Date - Aug 25 , 2026 | 10:52 PM

భావి తరాలకు సమతుల్య వాతావరణం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాల ఆవరణలో వనమహోత్సవం 2026 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎస్పీ నితికాపంత్‌, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డీఎఫ్‌వో బాలామణిలతో కలిసి మొక్కలు నాటారు

kumaram bheem asifabad- నాటిన మొక్కలను సంరక్షించాలి
మొక్కకు నీరు పోస్తున్న కలెక్టర్‌ హరిత

- వనమహోత్సవం కార్యక్రమంలో కుమరం భీం కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): భావి తరాలకు సమతుల్య వాతావరణం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాల ఆవరణలో వనమహోత్సవం 2026 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎస్పీ నితికాపంత్‌, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డీఎఫ్‌వో బాలామణిలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, డీడీ జాదవ్‌ అంబాజీ, అయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానా, కమిషనర్‌ తిరుపతి తెలిపారు.కాగజ్‌నగర్‌లో వనమహోత్సవ కార్యక్రమ సందర్భంగా మైక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని బెజ్జూరు ఇన్‌చార్జి రేంజ్‌ అధికారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దుర్గం సరోజా, ఎంఈవో సునీత, సెక్షన్‌ అధికారి సాఫియాబేగం, బీట్‌ అధికారులు నవ్యరెడ్డి, స్రవంతి, సాగరిక, వెంకటేశం, అనీల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి (ఆంధ్రజ్యోతి): మండలంలో వనమహోత్సవ కార్యక్రమం హట్టహాసంగా ప్రారంభమైంది. ఎంపీడీవో సత్యనారాయణ, సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏపీవో సయ్యద్‌ షోయబ్‌, ఈసీ సంతోష్‌, సాంకేతిక సహాయకులు భీంరావు, అరుణ, పంచాయతీ కార్యదర్శి వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.

సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): అడవులను, వన్యప్రాణులను సంరక్షించి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కంపా సీసీఎఫ్‌ క్షితిజ తెలిపారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలలో జరిగిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో ఎప్‌డీపీటీ శాంతారాం, ఎఫ్‌డీవో భార్గవ్‌ కుమార్‌, ఎఫ్‌డీఓ అప్పయ్య, వేణు బాబు, శ్రీనివాస్‌, లక్ష్మినారాయణ, సర్పంచ్‌ నాగమణి నానయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): గంగాపూర్‌ కెజీబీవీ హాస్టల్‌లో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ వెంకటేశం చారి మాట్లాడుతూ మనమహోత్సవ కార్యక్రమంలో అంతా భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ ఇస్తారు, రేంజ్‌ ఇన్‌చార్జి రమాదేవి, చంద్రమోహన్‌, డిప్యూటి రేంజ్‌ అధికారి బానేష్‌, సెక్షన్‌ అధికారి సద్దాం, రవి, స్వప్న, సంతోష్‌, బీట్‌ అధికారులు, ఎస్‌వో పద్మ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

పెంచికల్‌పేట, (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఎఫ్‌ఆర్వో అనిల్‌ కుమార్‌ అన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్‌ మాట్లాడుతూ మొక్కలు నాటడంతో రానున్న తరాల వారికి సమతుల్యమైన వాతావరణం అందుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భక్తు రాంచందర్‌, చప్పిడి రవీందర్‌, చౌదరి శ్రీనివాస్‌, ఉమాదేవి, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలోని భూర్నూర్‌(బి) గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ పెందోర్‌ గణపత్‌రావు ఆధ్వర్యంలో ఎంపీడీవో రవిందర్‌తోపాటు అధికారులు,గ్రామస్తులు సిర్పూర్‌(యు)-జైనూర్‌ రహదారి ఇరువైపులా మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని టోల్‌ ప్లాజా నుంచి ఖమన వరకు వనమ హోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో పాటిల్‌ జోత్స్న మొక్కలు నాటారు. కార్య క్రమంలో ఏపీవో శ్రావణ్‌కుమార్‌, సర్పంచు సునీత, కార్యదర్శి విలాస్‌ పాల్గొన్నారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని గడలపల్లిలో వనమహోత్సవ కార్యక్రమం సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆత్రం శంకరమ్మ, ఎంపీడీవోనగేష్‌, పీఎసీఎస్‌ చైర్మన్‌ చుంచు శ్రీనివాస్‌, ఎఫ్‌ఆర్‌వో రమాదేవి, ఏపీవో సాకిర్‌, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 10:52 PM