రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:53 PM
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లో గులాబీ జెండాలు ఎగరాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూతురు వివాహానికి హాజరైన అనం తరం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యకర్తల సమా వేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
-సింగరేణి మెడికల్ బోర్డు కోసం గల్లాపట్టి అడగాలి
-కాళేశ్వరం కట్టిందే తెలంగాణను కాపాడటానికి
-రూ. 52 కోట్లతో తుమ్మిడిహెట్టి నిర్మాణం ఎలా సాధ్యం..?
-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మంచిర్యాల, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లో గులాబీ జెండాలు ఎగరాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూతురు వివాహానికి హాజరైన అనం తరం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యకర్తల సమా వేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై ఘా టు వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యా రెంటీలు అమలు చేస్తామన్న సీఎం, 30 నెలలై నా చేయలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వ మాటలు, హామీలు నమ్మశక్యంగా లేవని, రాష్ట్రం లో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న ముఖ్యమంత్రికి అసలు అన్ని కోట్లలో ఎన్ని సున్నాలుంటాయో తెలుసునా...? అని ప్ర శ్నించారు. సీఎం నోటికి వచ్చినట్లు మాటలు న రుకుతున్నాడని, గట్టిగా అడిగితే లాగులో తొండ లు ఇడుస్తానంటున్నాడని ధ్వజమెత్తారు. కాళేశ్వ రం ప్రాజెక్టు కట్టిందే తెలంగాణను కాపాడటా నికని, రూ. 52 కోట్లతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించా రు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం గాలికొదిలారని, ఇంత లేకిడి, చండాలపు ముఖ్యమంత్రిని దేశం లోనే ఎక్కడా లేడని ధ్వజమెత్తారు. మున్ముందు జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయని, మళ్లీ కాం గ్రెస్‌కు అవకాశం ఇవ్వద్దని అన్నారు. రైతులు, సింగరేణి కార్మికులు, ప్రజల ముఖాల్లో సంతో షం చూడాలంటే మళ్లీ కేసీఆర్ రావలసిన అవ సరం ఉందన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరా మ రక్ష అని అన్నారు.
సీఎం బావమరిదిపై విచారణ జరపాలి....
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దోచుకో...దాచుకో పథకం నడుస్తోందని ఎద్దేవా చేశారు. సింగరే ణిలో సీఎం బావమరిది సృజన్‌రెడ్డి కనుసన్నల్లో కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆరోపించారు. టెండ ర్లలో సైట్ విజిట్ విధానం ప్రవేశపెట్టారని, ఆ సర్టిఫికేట్‌ను అడ్డంపెట్టుకొని సృజన్‌రెడ్డి వేల కోట్లు సంపాదిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ హయాంలో సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తే, నేడు మెడికల్ బోర్డు ఏర్పాటుకు కూడా నోచుకోవడం లేదన్నారు. ఆ నాడు తాము 16వేల వారసత్వ ఉద్యోగాలు ఇస్తే....వాటిపై ఏ సీబీ విచారణ జరుపుతామంటున్నారని, ముం దుగా సీఎం బావమరిది మీదనే ఎంక్వైరీలు వేయమని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. వెంటనే మెడికల్ బోర్డు పెట్టకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్, బీజేపీది ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారం...
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఇచ్చిపుచ్చు కునే వ్యవహారం నడుస్తుందని, అందుకే సింగరే ణితోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో జరుగు తున్న అవినీతిపైన విచారణ జరపడం లేదని ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి ఆర్‌ఆర్ టాక్స్, కేంద్ర హోంమంత్రి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అని చెప్పినా...ఎందుకు విచారణ జరప డం లేదని ప్రశ్నించారు.
క్యాతన్‌పల్లి ఎన్నికల్లో మంత్రి కుట్రలు....
క్యాతన్‌పల్లి మునిసిపల్ ఎన్నికల్లో సీఎం, మంత్రి వివేక్‌లు కుట్రలు చేసి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను 16 రోజులు జైలుకు పంపారని ఆరోపించారు. ఇంత నికృష్ట, నీచమె ౖన రాజకీయాలను తాను ఎక్కడా చూడలేదని అన్నారు. చెన్నూరు మునిసిపాలిటీలో కాంగ్రెస్ కు మెజార్టీ వస్తే వాళ్ల చైర్‌పర్సనే ఎన్నికయ్యా రని, క్యాతన్‌పల్లిలో తమకు మెజార్టీ వస్తే తమ వాళ్లే కదా ముఖ్య పదవుల్లో ఉండాలని అన్నా రు. కౌన్సిల్ హాలు లోపల మంత్రి, ఆయన తన యుడు ఎంపీ తమ కౌన్సిలర్లకు బ్యాంకు చెక్కు లు ఇవ్వజూపారని మండి పడ్డారు. అంత రా ద్దాంతం చేసే బదులు చైర్మన్ సీటు ఇవ్వు తమ్మి అని బాల్క సుమన్‌ను అడుక్కుంటే ఇచ్చి పారేసేవాడే కదా అని మంత్రి వివేక్‌ను ఉ ద్దేశించి అన్నారు. రాబోయే జిల్లా పరిషత్ ఎన్ని కల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు పలకాలని కేటీఆర్ కోరారు.