Share News

kumaram bheem asifabad- పొలం బాట.. వెనుకబాటు

ABN , Publish Date - Oct 23 , 2026 | 10:18 PM

కాగజ్‌నగర్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): సాగు పనులు చేయడానికి ఎరువుల రవాణాకు పొలం బాటలు కీలకం. కాగా పంటల సాగులో ఎడ్ల బండ్ల వినియోగం తగ్గిపోయింది. యాంత్రీకరణ పెరిగిపోతోంది. అయితే పొలాలకు వెళ్లడానికి దారులు సక్రమంగా లేక రాకపోకలకు పడరాని పాట్లు పడుతున్నారు.

kumaram bheem asifabad- పొలం బాట.. వెనుకబాటు
గువ్వలగూడ గ్రామంలో పొలాలకు వెళ్లే రహదారి

- జిల్లాకు మంజూరైన పొలం బాటలు 125

- పనులు కొనసాగుతున్నవి 30

- ఇంకా ప్రారంభించనివి 88

కాగజ్‌నగర్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): సాగు పనులు చేయడానికి ఎరువుల రవాణాకు పొలం బాటలు కీలకం. కాగా పంటల సాగులో ఎడ్ల బండ్ల వినియోగం తగ్గిపోయింది. యాంత్రీకరణ పెరిగిపోతోంది. అయితే పొలాలకు వెళ్లడానికి దారులు సక్రమంగా లేక రాకపోకలకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీబీజీరామ్‌జీ పథకంలో పొలం బాట నిర్మాణాలకు అవకాశం కల్పించింది. అయితే జిల్లాకు 125 పొలం బాట పనులు మంజూరు కాగా, ఇందులో ఇప్పటి వరకు పూర్తి చేసిన ఏడు మాత్రమే ఉండడం విశేషం. అలాగే ఇంకా ప్రారంభించనివి 88 ఉన్నాయి. ప్రస్తుతం 30 పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఈ పథకం లక్ష్యం ప్రధానంగా క్షేత్ర స్థాయిలో అధికారులు అవగాహన కల్పించక పోవడంతోనే ఈ పథకం ఆశయం నీరుగారి పోతుందని పలువురు చెబుతున్నారు.

- పథకంలో భాగంగా..

పథకంలో భాగంగా జిల్లాలో గత ఏప్రిల్‌ నెలలో పొలం బాట పనులు ప్రారంభం కాగా, జూన్‌ వరకు కొనసాగతాయి. వర్షా కాలం ప్రారంభం కావడంతో నిలిచి పోయాయి. దసరా పండుగ ముగియడంతో పనులు ప్రారంభం కానున్నాయని అధి కారులు చెబుతున్నారు. వీబీజీరామ్‌జీ పథకంలో ఆయా గ్రామాల్లోని కూలీలకు స్థానికంగా పనులు కల్పనతో ఉపాధి పొందుతున్నారు. రైతులు అభివృద్ధికి ఫాం ఫాండ్స్‌, భూసార సంరక్షణ పనులు, సిమెంటు రోడ్లు, పొలం బాటలు, తదితర పనులు చేపడుతున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ధ్రుష్టిలో ఉంచుకొని ప్రస్తుతం జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీబీ జీ రామ్‌జీ పథకంలో చేపడుతున్న పనులపై ఆశించిన స్థాయిలో రైతులకు అవగాహన లేక పోవటంతో లబ్ధి పొందలేక పోతున్నట్టు తెలుస్తోంది. పంచాయతీ స్థాయిలో క్షేత్ర సహాయకులు రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కూడా పూర్తిగా కల్పించడం లేదు. పొలం బాటలో రైతులకు లబ్ధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారి భాగస్వామ్యం కల్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిం చాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాని ప్రస్తుతం కొనసాగుతున్న 30 చోట్ల అలాంటి పరిస్థితి లేక అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు పొలం బాటలపై దృష్టి సారించి పనులను త్వరితగతిన చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని రైతులు చెబుతున్నారు.

Updated Date - Oct 23 , 2026 | 10:18 PM