kumaram bheem asifabad- ఆరోగ్యానికి ‘పోషణ’ బాట
ABN , Publish Date - Apr 15 , 2026 | 10:29 PM
తల్లి, పిల్లల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ‘పోష ణ పక్షోత్సవాలు’ (పోషణ్ పక్వాడ) నిర్వహి స్తోంది. ఇందులో భాగంగా పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించేందుకు అధికా రులు సమగ్ర కార్యాచరణ రూపొందించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తు న్నారు.
- పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించడమే లక్ష్యం
- వేసవి దృష్టా తగు జాగ్రత్తలతో కార్యక్రమం నిర్వహణ
బెజ్జూరు, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): తల్లి, పిల్లల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ‘పోష ణ పక్షోత్సవాలు’ (పోషణ్ పక్వాడ) నిర్వహి స్తోంది. ఇందులో భాగంగా పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించేందుకు అధికా రులు సమగ్ర కార్యాచరణ రూపొందించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తు న్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ప్రధాన లక్ష్యంతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్, పోషణ్ ట్రా కర్, ఆరోగ్యలక్ష్మి వంటి తదితర కార్యక్ర మాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 9వ తేదీ నుం చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించ నున్నారు. ఇందులో భాగంగా తల్లీబిడ్డ ఆరోగ్యం, వారికి పౌష్టికాహారం ఇవ్వడం వంటి కార్యక్ర మాల ను అంగన్‌వాడీ టీచర్లు చేపడుతూ సంబంధి త యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు.
పోషణ కార్యక్రమాలు ఇలా..
పిల్లల పోషణపై ప్రధాన చర్చ జరిగేలా టాక్ షోలు, చర్చలు, సభలను నిర్వహిస్తారు. తల్లిపాలపై అవగా హన కల్పిస్తారు. అంగన్ వాడీ కేంద్రాల్లో అమ్మమ్మ, నానమ్మలతో పోషణ కథలను చెప్పిస్తారు. గర్భిణులు పిల్లల కోసం ప్రత్యేక పోషణ, ఆరోగ్య శిబిరా లను నిర్వహిస్తారు. చిరు ధాన్యాలతో ఆహార పదా ర్థాలను తయారు చేయడం, వాటిని ప్రదర్శించడం. పోషణ మే ళా, క్విజ్ పోటీలు, పూర్వ ప్రాథమిక విద్యపై అవగా హన కల్పిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్రీ స్కూల్, సంసిద్ధత కార్యకలా పాలు, గ్రాడ్యుయేషన్ డే.నో స్ర్కీన్ అవర్, ఫ్యామిలీ ప్లే టైంపై ప్రచారం, బహిరంగ ఆటలు, శారీరక కార్యక్ర మాలు, క్రీడలు, ఇతర కార్యక్రమాలు 15రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల ఫొటో లు, వీడియోలు తీసి యాప్‌లో నమో దు చేస్తారు.
అందరి భాగస్వామ్యంతో విజయవంతం..
- అడెపు భాస్కర్, జిల్లా సంక్షేమ అధికారి, ఆసిఫాబాద్
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగం గా చేపట్టే పోషణ పక్వాడ కార్యక్ర మాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవం తంగా కొనసాగుతోంది. పక్షం రోజుల పాటు నిర్వహించే అవగాహన కార్యక్ర మాల్లో అందరిని భాగస్వామ్యం చేయడంతో పాటు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలను తీసుకుంటున్నాం. పౌష్టికాహారం అందించడం, ఆరోగ్యం, వ్యాయామం, పరిశు భ్రత, ఇతరత్రా విషయాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం.