kumaram bheem asifabad- స్కానింగ్‌కూ తప్పని వేదన
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:22 PM
మారుమూల మండలాల్లోని గర్భిణులకు స్కానింగ్ స్థానికంగా అందుబాటులో లేక పోవడంతో అవస్థలు పడుతు న్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు సాధారణ ప్రయాణమే అతి జాగ్రత్తగా చేయాలి. ప్రసవమయ్యే వరకు కడుపులో బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కాని ఏజెన్సీ మండలాలైన జైనూరు, సిర్పూర్(యు) మండలాల్లోని గర్భిణులు కేవలం స్కానింగ్ కోసమే కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది.
జైనూర్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మారుమూల మండలాల్లోని గర్భిణులకు స్కానింగ్ స్థానికంగా అందుబాటులో లేక పోవడంతో అవస్థలు పడుతు న్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు సాధారణ ప్రయాణమే అతి జాగ్రత్తగా చేయాలి. ప్రసవమయ్యే వరకు కడుపులో బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కాని ఏజెన్సీ మండలాలైన జైనూరు, సిర్పూర్(యు) మండలాల్లోని గర్భిణులు కేవలం స్కానింగ్ కోసమే కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది. జైనూరు, తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రుల లో స్కానింగ్ యంత్రాలున్నా రెడియాలజిస్టులు లేక పోవడం సమస్యకు ప్రధాన కారణం. దీంతో వారంత పరీక్షల నిమిత్తం వ్యయ ప్రయాసాల కోర్చి ఆదిలాబాద్ రిమ్స్‌కు వెళ్తు రాను పోను ఇబ్బందులు పడుతున్నారు. కాగా జైనూరు, తిర్యాణి ప్రభుత్వాసు పత్రుల్లో ఎక్స్‌రే ఈసీజీ పరికరాలున్నా వైద్యులు లేక గిరిజనులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో జైనూరు, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల ప్రజలు పరీక్షల నిమిత్తం ఆదిలాబాద్‌కు వెళ్తున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం వల్ల ఆర్థిక భారం పడుతుంది. ఇప్పటికైన అధికారులు స్పందించి తమ కష్టాలను దూరం చేయాలని కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం..
- సొనకాంబ్లే నమిత, పవర్‌గూడ
నేను ఏడు నెలల గర్భిణిని. నాకు ఒక్క సారి కూడ జైనూరు ప్రభుత్వాసుత్రిలో స్కానింగ్ చేయలేదు. ఇప్పటికే స్కానింగ్ కోసం నాలుగు సార్లు రిమ్స్ ఆసుత్రికి వెళ్ళాల్సి వచ్చింది. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. సంబంధిత అధికారులు స్పందించి జైనూరు ప్రభుత్వాసుపత్రిలో రేడియాలజిస్టును నియమిస్తే భారం తగ్గుతుంది.
అధికారుల దృష్టికి తీసుకెళ్తాం..
- సీతారాం, జిల్లా వెద్యాధికారి
ఈ సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి జైనూరు ప్రభుత్వ ఆసుత్రిలో స్కానింగ్ జరిగేలా చర్య లు చేపడతాం. గతంలో జైనూరు సీహెసీ రెడీయాల జిస్టులతో మాట్లాడి గర్భిణుల స్కానింగ్ చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.