Share News

సర్‌ ప్రక్రియలో వేగం పెంచాలి

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:35 PM

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ గడువు సమీపిస్తోందని అదనపు కలెక్టర్‌ పి. చంద్ర య్య అన్నారు.

సర్‌ ప్రక్రియలో వేగం పెంచాలి

సర్‌ ప్రక్రియలో వేగం పెంచాలి

ఫ అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

నెన్నెల, జులై 12 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ గడువు సమీపిస్తోందని అదనపు కలెక్టర్‌ పి. చంద్ర య్య అన్నారు. డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఈ నెల 24వరకే పూర్తిచేయాల్సి ఉన్నందున పనుల్లో వేగం పెంచాలన్నారు. ఆయన ఆదివారం నెన్నెల, ఆవడం గ్రామాల్లో పర్యటించారు. ఎన్యూమరేషన్‌ పత్రాలను పూరించడం తలో ఓటర్లకు అవగాహన కల్పించడంతో పాటు సర్‌ ప్రక్రియ అమలు తీరును పరిశీలించారు. ఎందరికి ఈఎఫ్‌లు అందజేశారు. పూరించినవి తి రిగి ఎన్ని స్వీకరించారో బీఎల్‌వోలను అడిగి తెలసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో స మావేశమయ్యారు. బీఎల్‌వోలకు అందరూ సహకరిస్తేనే త్వరితగతిన ఆన్‌ లైన్‌ చేస్తారని చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, బీఎల్‌ఏలు ఎన్యూమరేషన్‌ పత్రాలు పూరించడంలో సహకరించాలని కోరా రు. ఇంటికి వచ్చిన బీఎల్‌వోలకు పూర్తి వివరాలు అందజేసి ప్రజలు సహ కరించాలని కోరారు. ఇప్పుడు నిర్లక్ష్యం చేసి ఆతర్వాత బాధపడటం కంటే సకాలంలో ఫారాలు పూరించి తిరిగి ఇచ్చేయడం మంచిదని ప్రజలకు సూచించారు. ఆయన వెంట ఎంపీవో వేదాల శ్రీనివాస్‌, నెన్నెల, ఆవడం సర్పంచులు ఎండీ ఇబ్రాహీం, దుర్గం పావణి ఉన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:35 PM