Share News

పాఠశాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:01 AM

ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. పట్ట ణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో జరుగుతున్న భోజనశాలతో పాటు అదనపు గదుల నిర్మాణం పనులను శనివారం కలెక్టర్‌ ఆకస్మికంగా ప రిశీలించారు.

పాఠశాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

లక్షెట్టిపేట, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. పట్ట ణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో జరుగుతున్న భోజనశాలతో పాటు అదనపు గదుల నిర్మాణం పనులను శనివారం కలెక్టర్‌ ఆకస్మికంగా ప రిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థ లను బలోపేతం చేస్తూ విద్యార్థులకు సఖల సౌకర్యాలనను కల్పిస్తూ నా ణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్తు, మూత్రశాలలు, ప్రహరీ గోడ లాంటి పూర్తి సౌకర్యాలను సమకూర్చి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం గా పెట్టుకుందన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం బ్రేక్‌ఫాస్టు, భోజనం కూడా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - Jun 14 , 2026 | 12:02 AM