రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:51 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను అదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం వైఐఐ అర్‌ఎస్, పీఎంశ్రీ, కేజీబీవీ, అదర్శ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు,
సిరిసిల్ల, ఆగస్టు 24 (ఆంరఽధజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను అదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం వైఐఐ అర్‌ఎస్, పీఎంశ్రీ, కేజీబీవీ, అదర్శ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అభివృద్ధి సమీక్షించారు. చందుర్తి మండలం మూడపల్లిలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని టీజీ ఈడబ్ల్యూ ఐడీసీ అధికారులను ఆదేశించారు. పీఎం శ్రీ కింద జిల్లాలో ఎంపికైన 16 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్ ఇతర పనులపై సమీక్ష చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని 13 కేజీబీవీలు, 283 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అదనపు తర గతి గదులు, టాయిలెట్స్ ఇతర మరమ్మతు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 92 అంగన్వాడి భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి మొండ య్య, సీపీఓ శ్రీనివాసాచారి, జిల్లా సంక్షేమ శాఖ అధికా రి లక్ష్మీరాజం, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖి త, పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ గర్ట్‌చైల్డ్ ఎంపవర్‌మెంట్ అండ్ అడోలెసెంట్ సేఫ్టీ క్లబ్స్‌పై విద్యాశాఖ, షీటీం,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులతో కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అంజయ్య, జిల్లా విద్యాధికారి మొండయ్య, సీపీఓ శ్రీనివాసాచారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, ఎంఈఓలు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించాలి
సిరిసిల్ల అర్బన్: ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు విస్తృతంగా అవగహన కల్పించడంతో పాటు ఈ నెల 27న అన్ని వార్డులు, గ్రామాల్లో సభలను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం జరిగిన వీడియోకాన్సరెన్స్‌లో హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తోపాటు జిల్లా ఎన్నికల అధికారులతో ఎస్‌ఐఅర్ ప్రక్రియపై సమీక్షించారు. గ్రామ, వార్డు సభల్లో బీఎల్‌వోలు డ్రాఫ్ట్ ఓటరు జాబితా లోని ఓటర్ల పేర్లను చదివి వినిపించాలని, జాబితాలో పేరు లేని అర్హత కలిగిన పౌరులను గుర్తించాలని సూ చించారు. అవసరమైన ఆధారాలను సమర్పించి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే ఎస్ బీ కుమారి, వివిధ మండలాల తహసీల్దార్లు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.