kumaram bheem asifabad-కొనసాగుతున్న బాలేశ్వరస్వామి నవరాత్రులు
ABN , Publish Date - Jan 24 , 2026 | 10:26 PM
: జిల్లా కేంద్రంలోని భక్తుల కొంగు బంగారమైన శ్రీ బాలేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించే బాలేశ్వరస్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. 19వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆరో రోజు శనివారం ఆలయంలో అర్చకులు రవిచంద్ర చందావార్, ఈదులవాడ శ్రావణ్, ఢిల్లీ విజయ్‌కుమార్‌శర్మల ఆధ్వర్యంలో రుద్రహిత లక్ష్మినర్సింహా, లక్ష్మీకుబేర హోమం నిర్వహించారు.
- రథోత్సవానికి ఆలయం ముస్తాబు
ఆసిఫాబాద్‌రూరల్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని భక్తుల కొంగు బంగారమైన శ్రీ బాలేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించే బాలేశ్వరస్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. 19వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆరో రోజు శనివారం ఆలయంలో అర్చకులు రవిచంద్ర చందావార్, ఈదులవాడ శ్రావణ్, ఢిల్లీ విజయ్‌కుమార్‌శర్మల ఆధ్వర్యంలో రుద్రహిత లక్ష్మినర్సింహా, లక్ష్మీకుబేర హోమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో నిర్వహకులు బాలేశ్వర్, సత్యనారాయణ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు రథోత్సవం.
బాలేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రథసప ్తమి సందర్భంగా ఆలయంలో రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రథోత్సవం సందర్భంగా స్వామి వారిని దర్శించుకొనేందుకు కలెక్టర్ హఱిత, ఎస్పీ నితికా పంత్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సినీ నిర్మాత, దర్శకుడు నాగబాల సురేష్‌కుమార్ ఐదు రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం నుంచి నిత్య పూజ కార్యక్రమాల అనంతరం భక్తులకు శ్రీ పార్వతి సమేత బాలేవ్వర స్వామి దివ్య దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మహా అన్నదాన ప్రసాద వితరణ చేయనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు పెద్దవాగు సమీపంలో ఉత్సవ విగ్రహాలతో రథోత్సవాన్ని కన్నుల పండవగా నిర్వహిస్తారు. భక్తులు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం బందో బస్తు ఏర్పాటు చేసింది.