Share News

kumaram bheem asifabad-పాత పాలకవర్గాలకే మళ్లీ బాధ్యతలు

ABN , Publish Date - May 05 , 2026 | 10:29 PM

ప్రాఽథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)గత పాలకవర్గాలకే తిరిగి బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో మంగళవారం పలువురు మాజీ ఛైర్మన్లతో పాటు ఆయా పాలకవర్గ డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది ఫిబ్రవరి 14తో పీఏసీఎస్‌లో పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రభుత్వం డిసెంబరు 19 వరకు గడువును పొడిగించింది. ఆ తరువాత ప్రభుత్వం పీఏసీఎస్‌లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

kumaram bheem asifabad-పాత పాలకవర్గాలకే మళ్లీ బాధ్యతలు
చైర్మన్లకు ఉత్తర్వులు అందజేస్తున్న జిల్లా కో ఆపరేటీవ్‌ శాఖాధికారి మోహన్‌

- కోర్టు అదేశాలను అమలు చేసిన అధికారులు

- చైర్మన్‌లుగా పలువురు బాధ్యతల స్వీకరణ

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రాఽథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)గత పాలకవర్గాలకే తిరిగి బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో మంగళవారం పలువురు మాజీ ఛైర్మన్లతో పాటు ఆయా పాలకవర్గ డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది ఫిబ్రవరి 14తో పీఏసీఎస్‌లో పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రభుత్వం డిసెంబరు 19 వరకు గడువును పొడిగించింది. ఆ తరువాత ప్రభుత్వం పీఏసీఎస్‌లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రాథమిక సహకార సంఘాలకు ప్రత్యేకాధికారులను నియమించే ఆధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ పలు పీఏసీఎస్‌ మాజీ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాల అనంతరం హైకోర్టులో మూడు రోజుల క్రితం తీర్పును వెల్లడించింది. తక్షణమే మాజీ చైర్మన్లకు అయా పాలకవర్గాల డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పాత పాలకవర్గాలకే బాథ్యతలు కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా డీసీవోలు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలోని పలువురు చైర్మన్లు మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు.

రైతులకు సేవలు అందించాలి

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు రైతులకు సేవలు అందించాలని జిల్లా కో ఆపరేటీవ్‌ శాఖాధికారి మోహన్‌ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లను కొనసాగించాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వు కాపీలను మంగళవారం ఆయన చైర్మన్లకు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్లను అభినందించారు. వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. రైతులకు అవస రమైన సేవలు సత్వరమే అందించాలని కోరారు. ఉత్తర్వులు అందుకున్న తరువాత చైర్మన్లు ఆయనను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో చైర్మన్లు అలీబీన్‌ అహ్మద్‌, హన్ను, మాంతయ్య, శివాజీ, పెంటయ్య, శంకర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2026 | 10:29 PM