Share News

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:30 PM

గత అసెంబ్లీ ఎన్ని కల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధా నాన్ని వెంటనేఅమలు చేయాలని టీఎస్‌సీపీఎస్‌ ఈయూ రాష్ట్ర కార్యదర్శి గోపాల్‌ అన్నారు.

పాత పెన్షన్‌ విధానాన్ని  అమలు చేయాలి
కల్వకుర్తిలో ఆర్డీవో జనార్దన్‌రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

- టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శి గోపాల్‌

అచ్చంపేటటౌన్‌/ కల్వకుర్తి/ కొల్లాపూర్‌, న వంబరు 17 (ఆంధ్రజ్యోతి) : గత అసెంబ్లీ ఎన్ని కల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధా నాన్ని వెంటనేఅమలు చేయాలని టీఎస్‌సీపీఎస్‌ ఈయూ రాష్ట్ర కార్యదర్శి గోపాల్‌ అన్నారు. టీఎస్‌ సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యా యులందురూ సామూహిక సెలవు కార్యక్రమం లో పాల్గొని తహసీల్దార్‌ సైదులును కలిసి విన తి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులందరూ కనీ సం ఆసరా పెన్షన్‌ కన్నా హీనమైన పెన్షన్‌ తీసు కుంటూ తమ కుటుంబపోషణ భారంగా మా రిందన్నారు. ఉద్యోగుల సంతోషమే ప్రభుత్వానికి బలం కావున ఉద్యోగుల హక్కులను గౌరవిస్తూ వెంటనే పాత పెన్షన్‌ విధానాన్ని ప్రకటిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివి జన్‌ అధ్యక్షుడు తేజ నాయక్‌, ప్రధాన కా ర్యదర్శి విజయ్‌ కుమా ర్‌, నాయకులు సూర్య నాయక్‌, లోకేష్‌, మహే ష్‌, రాజేష్‌, లక్ష్మణ్‌, సైదులు, జానకిరామ్‌, భీము డు, వెంకటేష్‌, ఆంజనేయులు, శ్రీలత, జయలక్ష్మి, చంద్రకళ, సునీత పాల్గొన్నారు.

ఫ కల్వకుర్తిలో ఆ సంఘం డివిజన్‌ అధ్యక్షు డు పోరెడ్డి రాజేందర్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపా ధ్యాయులు ఆర్డీవో జనార్దన్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం నాగర్‌కర్నూల్‌ కలెక్టరే ట్‌ వద్ద నిర్వహించే ఓపీఎస్‌ సత్యాగ్రహ దీక్షలో పాల్గొనేందుకు కల్వకుర్తి నుంచి సుమారు ఉద్యో గ, ఉపాధ్యాయులు బయల్దేరారు. కార్యక్రమం లో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మీనరసింహా రావు, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు వేముల సై దులు, వంగూరు, వెల్దండ మండలాల అధ్యక్షు లు మల్లేష్‌, స్వామి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఫ కొల్లాపూర్‌లో ఆర్డీవో భన్సీలాల్‌కు వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానిక ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చారు. కార్యక్రమంలో డివిజన్‌ ప్రధాన కార్యదర్శి గణేష్‌ బాబు, ఉద్యోగులు దామోదర్‌, రాజు, చందు, మహేష్‌, అర్జున్‌, గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 11:30 PM