నామినేషన్‌ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:23 AM
మున్సిపల్ ఎన్ని కల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్‌దీపక్ పేర్కొన్నారు. గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్‌ల ప్రక్రియ తీరును పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ ఎన్ని కల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్‌దీపక్ పేర్కొన్నారు. గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్‌ల ప్రక్రియ తీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్‌లు స్వీకరణ ఉంటుందన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్‌లకు సం బంధించి అభ్యర్ధుల నుంచి నామినేషన్‌లను స్వీకరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఉన్న వారి నుంచి నామినేషన్‌లు స్వీకరిస్తామని, స మయం ముగిసిన తర్వాత అనుమతించమన్నారు. నామినేషన్ దరఖా స్తులు పూర్తి చేసిన అభ్యర్థులు హెల్ప్‌డెస్క్ వద్ద పరిశీలించుకుని స రైన నామినేషన్‌లు దాఖలు చేయాలన్నారు. ఈ నెల 31న నామినేషన్ లను పరిశీలించిన తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటన, ఫిబ్రవరి 1న నామినేషన్‌లపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, 2న పరిష్కారం, 3 న నామినేషన్‌ల ఉపసంహరణ అనంతరం పోటీల్లో ఉన్న వారి జాబి తా ప్రకటన ఉంటుందన్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లె క్కింపు ప్రక్రియ చేపట్టిన అబ్యర్ధుల ప్రకటన చేస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల సమాచారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 08736-250501ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ప్రశాంతంగా ఎన్ని కలు నిర్వహించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటా మన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ అన్వేష్, కల్లెరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ పాల్గొన్నారు.