నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:05 PM
మునిసిపల్ ఎన్ని కల నామినేషన్ ప్రక్రియను సజా వుగా నిర్వహించాలని కలెక్టర్ బ దావత్ సంతోష్ అన్నారు.
- మునిసిపల్ ఎన్నికలపై కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : మునిసిపల్ ఎన్ని కల నామినేషన్ ప్రక్రియను సజా వుగా నిర్వహించాలని కలెక్టర్ బ దావత్ సంతోష్ అన్నారు. హైద రాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొ ని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లకు సంబంధించి రెండవ సాధారణ మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా నిర్వహించారు. ఈ వీసీలో కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి అదనపు కలెక్టర్ దేవస హాయం, మునిసిపల్ కమిషనర్లు, నోడల్ అధి కారులు, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటి ల్‌తో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మునిసిపాలిటీలో 65వ వార్డులు 131 పోలింగ్ కేంద్రాలు, ఎన్నికలను చట్టబద్ధంగా నిష్పక్షపా తంగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల 28 నుంచి నామినేషన్ల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై మునిసిపాలిటీ అధికారులతో తరచూ టెలికాన్ఫ రెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించను న్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మునిసిపల్ ఎన్నిక ల్లో రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే అభ్య ర్థులకు ఆయా పార్టీల గుర్తులు కేటాయించబ డుతాయని మిగతా ఎన్నికల ప్రక్రియను అధికా రులంతా సమన్వయంతో పని చేసి ఎన్నికల ప్ర క్రియను సజావుగా పూర్తి చేయాలని ఆదేశిం చారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి మాస్టర్ శిక్షకుల ద్వారా అవసరమైన శిక్షణతోపాటు పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.