Share News

kumaram bheem asifabad-నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి

ABN , Publish Date - Jan 27 , 2026 | 10:47 PM

రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరిత అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డేవిడ్‌లతో కలిసి మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నామినేషన్‌ స్వీకరణలో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

kumaram bheem asifabad-నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరిత అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డేవిడ్‌లతో కలిసి మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నామినేషన్‌ స్వీకరణలో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియ నిర్వహణలో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ జారీ చేసి ఆదేశాల ప్రకారం వ్యవహరించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంమబటల వరకు చేపట్టాలని, నామినేషన్‌ పత్రాల పరిశీలన, ఉప సంహరణ, అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపులలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రతి అంశంలో అప్రమత్తంగా ఉండాలని ఎక్కడ పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని తెలిపారు. నామినేషన్‌ స్వీకరణ కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని వెలుతురు సరిపడ ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, శిక్షకులు ఊశన్న, తదితరులు పాల్గొన్నారు.

పటిష్ట బందోబస్తు చేపట్టాలి

ఆసిఫాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): సాధారణ మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందో బస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేస్తున్న ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల సామగ్రి పంపిణీ , కౌంటింగ్‌ కేంద్రం, స్ట్రాంగ్‌ రూమ్‌లను ఎస్పీ నితికా పంత్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి మంగళవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ కమిషన్‌ను ఆదేశించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌ కేంద్రాలు ఒకే ప్రదేశంలో ఉండడంతో బందోబస్తు పటిష్టం చేయాలని చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఫిబ్రవరి 11న పోలింగ్‌, 13న ఆసిఫాబాద్‌ మున్సిపాలిటికీ సంబంధించిన 20 వార్డుల కౌంటింగ్‌ ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కార్యక్రమలో సీఐ బాలాజీ వరప్రసాద్‌, కమిషనర్‌ గజానన్‌, ప్రిన్సిపాల్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 10:47 PM