kumaram bheem asifabad- నామినేటెడ్ బాట
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:01 PM
ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)కు నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లు నియమించా లని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, వికారాబాద్ జిల్లాలోని పలు సహకార సంఘాలకు పాలకమండళ్లను నియమిస్తూ ఉత్తర్వు లు జారీ చేశారు. సహకార సంఘాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరి 14తో ముగియడంతో ప్రత్యేకాధికా రులను నియమించారు
- మార్కెట్‌యార్డుల తరహాలో నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం
- ఆశావహుల ఆశలకు రెక్కలు
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)కు నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లు నియమించా లని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, వికారాబాద్ జిల్లాలోని పలు సహకార సంఘాలకు పాలకమండళ్లను నియమిస్తూ ఉత్తర్వు లు జారీ చేశారు. సహకార సంఘాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరి 14తో ముగియడంతో ప్రత్యేకాధికా రులను నియమించారు. ఎన్నికలు నిర్వహించే బదులు మార్కెట్‌యార్డుల మాదిరిగా నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరి కొంతమంది ఈ పదవుల్లో కొలువుదీరే అవకాశం ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొందరు నాయకులకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. దీంతో పీఎసీఎస్‌లో అవకా శం కల్పించే అవకాశం ఉందని పలువురు భావిస్తు న్నారు. దీంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
- పంచాయతీ ఎన్నికల తరహాలో..
సహకార సంఘాలకు ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినా పంచాయతీ ఎన్నికల తరహాలో పరోక్షంగా పార్టీల ప్రమేయం ఉంటుంది. సభ్యత్వం ఉన్న వారికే ఓటు హక్కు ఉంటుంది. సభ్యులుగా పలు పార్టీలకు చెందిన వారు ఉంటారు. ముందుగా డైరెక్టర్లుగా ఎన్ని క కావాల్సి ఉంటుంది. ఎన్నికైన డైరెక్టర్లు ఇప్పటి వర కు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకునే వారు. ఎన్నికలు అనగానే రాజకీ యపార్టీల ప్రమేయం ఉంటుంది. తాజాగా నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారితోనే పాలకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పార్టీ నేతలు పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
- జిల్లాలో 12 పీఏసీఎస్‌లు..
జిల్లాలో 12 సహకార సంఘాలు ఉన్నాయి. 23,788 మంది సభ్యులు ఉన్నారు. నామినేటెడ్ పద్ధతిలో పదవులు భర్తీ చేస్తే జిల్లాలోని 12 సంఘా లకు చైర్మన్, వైస్‌చైర్మన్ పోస్టులతో పాటు 156 మందికి డైరెక్టర్లుగా అవకాశం వస్తుంది. జిల్లా స్థాయిలో వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం తప్ప వేరే పోస్టులు లేవు మార్కెట్ పాలకవర్గాన్ని స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాదిస్తారు. ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో జిల్లా ఇన్‌చార్జి మంతి ప్రతిపాదన మేరకు పాలకవర్గాలకు ప్రభుత్వం ఆమో దం తెలుపుతుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం నూతన పీఏసీఎస్‌లను పెంచే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఇది వరకే 12 సహకార సంఘాలు ఉన్నాయి. మరో మూడు సహకార సంఘాల కోసం అధికా రులు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. లింగాపూర్, చింతలమానేపల్లి, పెంచికలపేట మండలాల్లో నూత న సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. స్థానిక అవసరాలు, రైతుల సేవలకు అను గుణంగా వాటి సంఖ్య పెరగనుంది.