నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:56 PM
ఎటువంటి ఆర్థి క భద్రత, భరోసాలేని నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానా న్ని అమలు చేయాలని టీఎస్‌సీపీ ఎస్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శి గో పాల్ అన్నారు.
- టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శి గోపాల్
అచ్చంపేటటౌన్, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : ఎటువంటి ఆర్థి క భద్రత, భరోసాలేని నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానా న్ని అమలు చేయాలని టీఎస్‌సీపీ ఎస్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శి గో పాల్ అన్నారు. ఆదివారం టీ ఎన్‌జీవో భవనంలో చిన జన జాగరణ యాత్ర సన్నాహక సమావేశం నిర్వ హించారు. ఇటీవల గుండెపోటుతో మృతిచెం దిన ఉపాధ్యాయుడు మోహన్ చిత్రపటానికి ఈ సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం వెంటనే పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని కోరారు. నూతన పెన్షన్ వల్ల ఇబ్బందులకు గురువుతు న్న ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా ఉండా లన్నారు. ఈ నెల 11న భద్రాద్రి జిల్లాలో ప్రా రంభమయ్యే జన జాగరణ యాత్ర 16వ తే దీన అచ్చంపేట చేరుకుంటుందని, డివిజన్‌లో ని అన్ని మండలాల ఉద్యోగులు, ఉపాధ్యాయు లు కచ్చితంగా హాజరుకావాలని కోరారు. ఈ కా ర్యక్రమంలో సంఘం డివిజన్ అఽఽధ్యక్షుడు తేజ నాయక్, ఉపాధ్యాయులు మహేశ్, రామ్‌లాల్, భూపతి, జానకిరామ్, శ్రీకాంత్, అనిల్, రామాం జనేయులు, క్రాంతి పాల్గొన్నారు.