ఆగని విత్తన దందా...
ABN , Publish Date - May 23 , 2026 | 11:31 PM
నకిలీ విత్తనాలు పొరుగు రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా సరఫరా అవుతు న్నాయి. ఎన్ని నిషేధాలు విధించినా అక్రమ విత్తన దం దా మాత్రం ఆగడం లేదు.
-పొరుగు రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా సరఫరా
-రూట్లు మార్చి.. అక్రమ వ్యాపారం
కోటపల్లి, మే 23 (ఆంధ్రజ్యోతి) : నకిలీ విత్తనాలు పొరుగు రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా సరఫరా అవుతు న్నాయి. ఎన్ని నిషేధాలు విధించినా అక్రమ విత్తన దం దా మాత్రం ఆగడం లేదు. ప్రతినిత్యం పోలీసు, వ్యవ సాయ శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నా పొ రుగు రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు జిల్లాలోని ఈ మూలకో సరఫరా అవుతూనే ఉన్నాయి. దీంతో జిల్లాలో ని వందలాది మంది రైతులు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోతున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని ఏ జెంట్ల మాయమాటలు నమ్మి సాగు చేసి అప్పుల ఊబి లో కూరుకుపోతున్నారు. మరో వైపు విత్తన దందా చేసే వారు రూట్లు మార్చి అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
-పక్క రాష్ట్రం నుంచి....
పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి య థేచ్ఛగా అక్రమంగా నకిలీ విత్తనాల దందా కొనసాగు తూనే ఉంది. ఇటీవల కోటపల్లి మండలంలోని అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద 30.7 టన్నుల నకిలీ వరి విత్తనా లను పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులు పట్టుకు న్నారు. మహారాష్ట్రలోని సిరొంచ మీదుగా తెలంగాణలో ని కరీంనగర్ జిల్లా మానకొండూరుకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. రూ. 21.49 లక్షల విలువ చేసే ఈ నకిలీ విత్తనాలు టీఎస్29టీబీ6555 నెంబరు గల లారీ లో ఎలాంటి వే బిల్లులు, ధృవీకరణ పత్రాలు లేకుండా విత్తనాలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అ యితే విత్తనాల నాణ్యతను పరిశీలించేందుకు శాంపుల్స్ ను హైద్రాబాద్‌కు చెందిన డీఎంఏ, ఎస్‌పి, డీసీఎం ల్యా బ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సీడ్ ఆర్గనైజర్ , మేనేజింగ్ డైరెక్టర్, లారీ యజమాని, లారీ డ్రైవర్‌లను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఇలా జిల్లాలో ఏదో ఒక మూలన నకిలీ విత్త నాల దందా కొనసాగుతూనే ఉంది.
-ఆకర్షించే ప్యాకింగ్
నకిలీ విత్తనాలను అసలైన వాటిలా ఆకర్షించే ప్యాకిం గ్ చేసి మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. రైతులకు ఈ విత్తనాలకు సంబంధించి ఎలాంటి రశీదులు కానీ బిల్లు లు కానీ ఇవ్వడం లేదు. నకిలీ నిషేధిత విత్తనాలు కొ నుగోలు చేసి నష్టపోయిన రైతులు తమ మీద ఎక్కడ కేసులు అవుతాయేమోనని ఫిర్యాదు చేసేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు. అయితే ముందుగానే దీన్ని ప సిగట్టని రైతులు ఆకర్షించే ప్యాకింగ్‌ను చూసి నాణ్య మైన విత్తనాలని కొనుగోలు చేసి మోసపోతున్నారు.
- అసలు సూత్రధారులు ఎవరు....
నకిలీ అక్రమ విత్తన దందాలో ఎక్కడ కూడా అసలు సూత్రధారులు పట్టుబడడం లేదు. కిందిస్థాయి ఏజెం ట్లు లేదా, స్థానిక రైతులు మాత్రమే పట్టుబడుతుండ డం విశేషం. అసలు దందా నడిపే వారు ఇంత వరకు చిక్కకపోవడం గమనార్హం. అసలు సూత్రదారులు వెనక ఉండి నడిపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు అసలు నిందితులను కనిపెట్టి అక్రమ విత్తన దందాను అం తం చేయాలని పలువురు కోరుతున్నారు.
-ఈ రాష్ట్రాల నుంచి ....
నకిలీ నిషేధిత విత్తనాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఉమ్మడి జిల్లాకు చేరుకుంటున్నాయి. అక్రమార్కులు సీజన్ కంటే ముందే విత్తనాలను వస్తువుల మాటున గమ్యస్థానాలకు చేర్చు కుంటున్నారు. కొందరు నకిలీ బిల్లులతో ట్రాన్స్‌పోర్టుల ద్వారా ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు. నకిలీ విత్త నాలను నివారించేందుకు మండల స్థాయిలో టాస్క్ ఫో ర్స్ బృందాలు ఏర్పాటు చేసినా సఫలం కావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ విత్తనాలు అమ్మి న వ్యాపారుల లైసెన్స్‌లను రద్దు చేయాలని రైతులు కో రుతున్నారు. జిల్లాలోని కోటపల్లి, చెన్నూరు, వేమనపల్లి మండలాలకు మహారాష్ట్ర నుంచి, ఉమ్మడి జిల్లాలోని జైనథ్, బేల, తదితర ప్రాంతాలకు గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి సైతం నకిలీ నిషేధిత విత్తనాలు సరఫరా అవుతున్నాయనే మాటలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు నకిలీ విత్త నాలపై ప్రత్యేక దృష్టి సారించాలని లేకుంటే అన్నదాత నకిలీ విత్తనాలు కొని చిత్తు కావాల్సిందేనని అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి.