ఎడతెగని.. పోడు లొల్లి
ABN , Publish Date - Jul 17 , 2026 | 10:59 PM
వానాకాలం వ చ్చిందంటే చాలు అటవీ పరిసర గ్రామాల్లో రైతులకు, ఫారెస్టు అధికారులకు పోడు లొల్లి మొదలవుతుంది. రైతులు సాగుకు వెల్లడం.. అటవీ శాఖ వారు అడ్డుకో వడం పరిపాటిగా మారింది.
-అటవీ, రెవెన్యూ భూములకు హద్దులు లేక గొడవలు
-రిజర్వు ఫారెస్టు అంటూ సాగు అడ్డగింత
-చామనపల్లిలో రైతు ఆత్మహత్య యత్నంతో కలకలం
-పట్టాలు ఉన్నా వేధిస్తున్నరంటున్న రైతులు
-జిల్లాలో వివాదంలో 20 వేల ఎకరాలు
నెన్నెల, జులై 17 (ఆంధ్రజ్యోతి) : వానాకాలం వ చ్చిందంటే చాలు అటవీ పరిసర గ్రామాల్లో రైతులకు, ఫారెస్టు అధికారులకు పోడు లొల్లి మొదలవుతుంది. రైతులు సాగుకు వెల్లడం.. అటవీ శాఖ వారు అడ్డుకో వడం పరిపాటిగా మారింది. తమకు పట్టాలు ఉన్నా యని రైతులు అటుండగా.. రిజర్వు ఫారెస్టు అక్రమిం చుకుంటున్నారని అటవీ అధికారులు వాదిస్తున్నారు. ఈ విషయంపై పలు చోట్ల ఘర్షణలు జరుగుతు న్నా యి. తాజాగా వేమనపల్లి మండలం చామనపల్లి శివా రులో ఫారెస్టు అధికారులు సాగు అడ్డకోవడంతో మన స్థాపం చెందిన నూకల తిరుపతి పురుగల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జీవనాధార మైన భూమి వదులుకోలేదక తిరుపతి ప్రాణాలు తీసు కోవడానికి సిద్ధపడ్డాడు. నెన్నెల శివారులోని సర్వే నంబ రు 671, 672లో భూముల్లో రైతులను దున్ననివ్వడం లేదు. దున్నితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. క న్నెపల్లి మండలం కొత్తపల్లి శివారు సాగుభూములను స్వాధీనం చేసుకునేందుకు ట్రెంచు తవ్వకానికి వచ్చిన ఫారెస్టు అధికారులను అక్కడి రైతులు అడ్డగించారు. ఈ క్రమంలో అధికారులకు, రైతులకు మద్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రా వాల్సి వచ్చింది. పోడు భూములు ఉన్న ప్రతీ చోట ఇదే పరిస్థితి ఉంది. అటవీ, రెవెన్యూ శాఖల సరిహద్దు వి వాదానికి శాస్వత పరిష్కారం లభించక దశాబ్దాల తర బడి నిరుపేదలు ఇక్కట్ల పాలవుతున్నారు. రికార్డుల ప్ర కారం మంచిర్యాల జిల్లాలో 20,155 ఎకరాలు వివాదా స్పదంగా ఉన్నాయి. భూతగాదాల్లో సుమారు మూడు వేల మంది పేద రైతులు నలిగిపోతున్నారు. సమస్య ప రిష్కారం కోసం వామపక్ష పార్టీలు, ప్రతిపక్షాలు, గిరి జన, దళిత సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. తాత ల నాడు సర్వే చేసి పెట్టిన హద్దుల ఆనవాళ్లు లేక ఏ భూములు ఏ శాఖకు చెందినవో తెలియకుండా ఉంది.
-దళితులు.. గిరిజనులే అధికం..
మిగులు భూములను గుర్తించి వాటికి పట్టాలు ఇ చ్చామని, ఆ భూములపై పట్టాదారులకు పూర్తి హ క్కులు ఉంటాయని రెవెన్యూశాఖ వారు అంటుండగా.. సాగుకు వెళ్లిన రైతులను అటవిశాఖ వారు అడ్డుకుం టున్నారు. రిజర్వు ఫారెస్టుకు చెందిన భూముల్లో పం టలెలా వేస్తారని అటవీ శాఖవారు కేసులు పెడుతు న్నారు. పొదలు, చెట్లు, పుట్టలు తొలగించుకుని రైతు లు అష్టకష్టాలు పడి సాగుకు యోగ్యంగా చేసుకున్న భూముల చుట్టూ ట్రెంచులు తవ్వుతున్నారు. స్వాధీనం చేసుకొని కొత్తగా మొక్కలు నాటుతున్నారు. దీంతో ప్ర భుత్వం ద్వారా పట్టాలు పొందిన వారి పరిస్థితి అగ మ్యగోచరంగా మారింది. తాము బ్యాంకుల్లో పంట రు ణాలు కూడా తీసుకున్నామని చెబుతున్నారు. దశా బ్దా ల తరబడి సాగులు ఉన్నవారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వారిలో మెజార్టీ రైతులు దళితులు, గిరిజనులే ఉన్నారు.
-వివాదంలో 20,155 వేల ఎకరాలు
2017-18 రికార్డుల ప్రక్షాలన లెక్కల ప్రకారం జిల్లా లో 20,155 ఎకరాల్లో అటవి, రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. చాలా మంది పోడు, పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్నప్పటికి అటవీ శాఖ అధికారులు రైతులను అడ్డగిస్తున్నారు. మూడు వే ల మంది వరకు ఈ సమస్యలతో నలిగి పోతున్నారు. పలు చోట్ల అటవీ శాఖ దాడులు, కేసులు తట్టుకోలేక కొందరు సాగు మానేశారు. జిల్లాలోనే అత్యధిక ప్రభు త్వ భూములున్న నెన్నెల మండలంలో దాదాపు 4వేల ఎకరాల భూమి వివాదంలో ఉంది. నెన్నెల శివారులోని సర్వే నంబరు 671లో దశాబ్దాల కాలం నుంచి సాగులో ఉన్న రైతులను అధికారులు అడ్డుకున్నారు. కన్నెపల్లి, జైపూర్, వేమనపల్లి, చెన్నూరు, మందమర్రి, కోటపల్లి మండలాల్లో వివాదస్పద భూములున్నాయి. ఏళ్ల తర బడి వివాదానికి పరిష్కారం లభించక వేల ఎకరాల భూములు నిరుపయోగంగా ఉన్నాయి.
-జాయింట్ సర్వే లేక...
ఆర్బాటంగా పట్టాలందజేసిన ప్రభుత్వం, ప్రజాప్ర తినిధులు ఆ తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకో వడం లేదు. కేటాయించిన భూములు ఏ శాఖకు చెం దుతాయో నిర్థారించాల్సిన జాయింట్ సర్వే నిర్వాహ నలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం పట్టాలి చ్చిన భూమి పొజీషన్ (మోఖా) ఎక్కడుందో తెలియక పోవడంతో ఆ నంబరులో ఎక్కడ భూమి ఖాళీ ఉంటే అక్కడ దున్నడం ప్రారంభించారు. సర్వే నంబరు ఆధా రంగా ప్రభుత్వ భూమిలోనే రైతులు సాగు చేసుకుం టున్నారు. కొన్నాళ్లు సాగు చేసుకున్నాక ఈ భూములు తమవని అటవి శాఖ అడ్డుకుంటోంది. రికార్డుల్లో పీపీ ల్యాండ్‌కే పట్టాలు ఇస్తున్నామని రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. పట్టాల పేరిట ఫారెస్టు భూములను క బ్జా చేస్తున్నారని అటవిశాఖ వారు పేర్కొంటున్నారు. అ టవీభూములు నిర్థారించేందుకు చాలా ప్రాంతాల్లో స రైన హద్దులు లేవు. దీంతో రిజర్వు ఫారెస్టు హద్దులే వో తెలియడం లేదు. ప్రభుత్వం రక్షిత అటవి ప్రాంతాన్ని గుర్తించినపుడు అందుకు అనుగునంగా రికార్డుల్లో మా ర్పులు చేయలేదు. దీంతో మిగులు భూములపై వివా దం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం చేపట్టిన భూ ప్ర క్షాలనలో రికార్డుల శుద్దీకరణ చేశారే తప్ప భూము లకు కొలతలు పెట్టలేదు. దీంతో సమస్యకు ఇంకా పరి ష్కారం లభించలేదు. ఇప్పటికైన అటవీ, రెవెన్యూ భూ ముల లెక్క తేలిస్తే ప్రశాంతంగా సాగు చేసుకుంటా మని అధికారులను రైతులు వేడుకుంటున్నారు.